Take a fresh look at your lifestyle.

పాఠశాలలు ప్రారంభానికి ముందే మౌలిక సదుపాయాలు కల్పించాలి

  • అంగన్వాడీ, హాస్టళ్లలో కూడా చిన్నపాటి మరమ్మతులు చేపట్టి , పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోండి.
  • వీడియో కాన్ఫరెన్స్లో సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం.

ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి: ఈ నెల 12న ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్ అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభమవుతున్నందున 11వ తేదీ నాటికి పాఠశాలలు హాస్టల్స్ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులు ఆదేశించారు.గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి పాఠశాలలు, హాస్టల్లో మౌలిక సదుపాయాలు, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకం, తాగునీటి వసతి పై ఎంపీడీవోలు, సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలలు, హాస్టల్స్, అంగన్వాడి కేంద్రాలు ఈ నెల 12న ప్రారంభం అమవుతున్న సందర్భంగా ఆయా శాఖల సంక్షేమ అధికారులతో చిన్నచిన్న సమస్యలు ఉంటే ఖర్చు చేసి పరిష్కరించాలని ఆదేశించారు.పాఠశాలలు, హాస్టళ్ల ఆవరణలలో పరిశుభ్రత, తాగునీటి వసతి, ఎలక్ట్రికల్ పనులు వెంటనే చేపట్టాలని,వీటికి సంబంధించిన నిధులు వెంటనే మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.అంగన్వాడి కేంద్రాలలో సరిపడా సరుకులు, కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా చూసుకోవాలని ఆయన సూచించారు.ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి.ఇందిరమ్మ ఇండ్ల పై కలెక్టర్ మాట్లాడుతూ ఇంకా గ్రౌండింగ్ కానీ ఇండ్లను వెంటనే గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పనులు వేగవంతం చేయాలని అన్నారు.ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుని లబ్ధిదారులు ఆలస్యం చేయకుండా ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ యాప్ లో నమోదు చేస్తూ లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయం వెంటనే అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.అధికారులు సమన్వయంతో పని చేసి ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

  • రాజీవ్ యువ వికాశంలో గ్రామంలో ఒకే రకమైన యూనిట్లు ఉండరాదు.

రాజీవ్ యువ వికాసం పథకం పై కలెక్టర్ మాట్లాడుతూ లబ్ధిదారులు యూనిట్ ఎంపిక లో అందరూ ఒకే విధమైన యూనిట్లు పెట్టుకోవద్దని సూచించారు. గ్రామంలో అందరూ జనరల్ స్టోర్స్ కాకుండా ఒకే యూనిట్ ఉండకుండా బార్బర్ షాప్, టెంట్ హౌస్ లాంటివి వేరే వేరే యూనిట్లు ఉండాలని స్పష్టం చేశారు.మహిళలకు బ్యూటీ పార్లర్లు ఎంపిక చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు.

  • తాగు నీటికి కొరత రావొద్దు.

జిల్లాలో ఎక్కడ త్రాగునీటి కొరత రాకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఎక్కడైనా త్రాగునీటి సమస్య ఉంటే వెంటనే పునరుద్ధరించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, డిఆర్ఓ సంగీత, డిఆర్డీఎ పిడి శ్రీలత, హౌసింగ్ పిడి హన్మంతు నాయక్, జిల్లా అధికారులు, ఎంపిడిఓలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.