Take a fresh look at your lifestyle.

కాళేశ్వరం కూలితే  నీరు ఎలా ఎత్తి పోస్తున్నారు:బీఆర్ఎస్?

  • ప్రాజెక్టుపై కాంగ్రెస్ దుష్ప్రచారం మానుకోవాలి..

  • పంతాలు కాదు ప్రజల పక్షాన నిలవాలి..

  • కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతో తెలంగాణ తల్లికి జలాభిషేకాలు

  • సీఎం దిష్టిబొమ్మ దహనం.. అడ్డుకున్న పోలీసులు

ముద్ర ప్రతినిధి, భువనగిరి

కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని గోబెల్స్ ప్రచారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అదే  కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మోటర్ ఆన్ చేసి గోదావరి నీటిని వాడుకుంటుందని ప్రాజెక్టు కూలితే నీళ్లు ఎలా ఎత్తిపోస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి నిశితంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపై ప్రాజెక్టు దుష్ప్రచారం మానుకోవాలని డిమాండ్ చేశారు. బస్వాపురం ప్రాజెక్టు నుంచి భారీ బైక్ ర్యాలీ తో  గోదావరి నీటిని తీసుకొచ్చి తెలంగాణ తల్లి విగ్రహానికి జలాభిషేకం చేసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలో నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళే శ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని రూ. లక్ష కోట్లు గంగలో పోశారని , ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదంటూ  కాంగ్రెస్ ప్రభుత్వం  చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని భువనగిరి నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డిలు అన్నారు. సోమవారం బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో  కాళేశ్వరం జలాలతో తెలంగాణ తల్లికి జలాభిషేకం చేశారు. అనంతరం  కాళేశ్వరం ప్రాజెక్ట్  పైన, కేసీఆర్ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా జిల్లా కార్యాలయం నుండి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ తో జిల్లా కేంద్రంలో ని ప్రిన్స్ చౌరస్తా లో రాస్తారోకో నిర్వహించి ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను తగులబెట్టి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నిరసన చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో  తోపులాట చోటుచేసుకుని ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ శాసనసభ్యులు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, బి.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బూడిద బిక్షమయ్య గౌడ్, బి ఆర్ ఎస్ వి రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు, రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షులు కొలుపుల అమరేందర్, బిఆర్ఎస్ భువనగిరి పట్టణ మండల అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, జనగాం పాండు, మండల పట్టణ ప్రధాన కార్య దర్శులు ఓం ప్రకాష్ గౌడ్, రచ్చ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.