Take a fresh look at your lifestyle.

మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి- మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్

 

ముద్ర :కాప్రా

చర్లపల్లి డివిజన్ పరిధిలోని విద్యా మారుతీ నగర్ కాలనీలో యాహ్వే-జీరే గ్రేస్ ట్రస్ట్ చైర్మన్ వి. మాథ్యూ,
కోశాధికారి వి. మెర్సీ ప్రియ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ఇటువంటి శిక్షణ కేంద్రాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. కుట్టు విద్య ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందడంతో పాటు తమ కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.