Take a fresh look at your lifestyle.

మాజీ ఎమ్మెల్యేకు స్పీకర్ నోటీసులు

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే ముడుపు వ్యవహరంలో చర్యలు
నిరాధార ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని డిమాండ్

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నుంచి అసెంబ్లీ స్పీకర్‌ ముడుపులు తీసుకున్నారంటూ వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ చేసిన ఆరోపణలపై స్వీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఆనంద్ కు లీగల్ నోటీసులు పంపించారు. తనపై నిరాధార ఆరోపణలు చేసి వ్యక్తిగత ప్రతిష్టకు ఆనంద్ భంగం కలిగించారని నోటీసుల్లో స్పీకర్ పేర్కొన్నారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ముడుపులు ముట్టినాయి కాబట్టే నిర్ణయం తీసుకోవడం లేదని స్థానికంగా ప్రచారం జరుగుతోందని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్… మెతుకు ఆనంద్ కు లీగల్ నోటీసులు పంపించారు. మరోవైపు.. మెతుకు ఆనంద్‌పై స్థానిక కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్​కుమార్‌ను విమర్శించే నైతిక హక్కు మెతుకు ఆనంద్‌కు లేదని కాంగ్రెస్ వికారాబాద్​మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. వికారాబాద్ ప్రాంత అభివృద్ధికి మెతుకు ఆనంద్ ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్​చేశారు. గౌరవప్రదమైన పదవిలో ఉన్న గడ్డం ప్రసాద్‌పై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.