Take a fresh look at your lifestyle.

బీఆర్ఎస్ ను ఎవరు వ్యతిరేకించినా ఉపేక్షించేది లేదు

  • పార్టీ నుంచి కవిత సస్పెన్షనే నిదర్శనం

  • బీఆర్ఎస్ బీబీనగర్ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు

బీబీనగర్, ముద్ర విలేకరి: భారత రాష్ట్ర సమితి పార్టీ ని ఎవరు వ్యతిరేకించిన ఉపేక్షించేది లేదనడానికి, మంగళవారం పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత సస్పెండ్  కావడమే నిదర్శనమని పార్టీ బీబీనగర్ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. గత మూడు నెలల నుంచి పార్టీని కించపరుస్తూ, పార్టీకి నష్టం కలిగే విధంగా పార్టీ పెద్దలను, సీనియర్లను కించపరుస్తూ, పార్టీ ఆదేశాలకు, ఆదర్శాలకు వ్యతిరేకంగా ఆమె వ్యవహరిస్తున్నారని అన్నారు. సొంత ఇంటి మనిషే అయినా… ఎమ్మెల్సీ కవితను, కొంచెం కష్టమైనా కూడా క్రమశిక్షణ చర్య తీసుకుని సస్పెండ్ చేయడం పార్టీ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని ఆయన అన్నారు. ఇక ముందు ఎవరైనా, ఎంత పెద్ద నాయకులైనా పార్టీ విధానాలకు కట్టుబడి లేకపోతే వారిపై చర్యలు తప్పవు అని ఇదే నిదర్శనమని శ్రీనివాసులు తెలిపారు. ఇది మొదట ఉద్యమ పార్టీ అని, తర్వాతనే రాజకీయ పార్టీ అని అన్నారు. కెసిఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసిఆర్ అనే విధంగా ప్రజల గుండెల్లో నాటుకపోయిన  బి ఆర్ ఎస్ పార్టీకి అధ్యక్షులైన కేసిఆర్ గారి సొంత కూతురే తండ్రి అడుగు జాడల్లో నడవాల్సింది పోయి స్వప్రయోజనాల కోసం బిజెపి, కాంగ్రెస్ పార్టీ పెద్దలు పన్నిన పన్నాగంలో చిక్కుకొని పార్టీని అప్రతిష్ట పాలు చేయాలనుకోవడం పొరపాటని అన్నారు. అందుకే ఈ శిక్ష! ఇది ప్రజలందరూ అర్థం చేసుకుంటారని, పార్టీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షాల్లో ఉన్న పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణ ముఖ్యమని పేర్కొన్నారు.

 

 

 

 

Leave A Reply

Your email address will not be published.