Take a fresh look at your lifestyle.

అదిగో చిరుత….

* సీసీ పుటేజ్ లో రికార్డు అయిన చిరుత సంచారం దృశ్యాలు

* గత మూడు నెలలుగా భయాందోళనలో గ్రామస్తులు

* చిరుతను బందించేందుకు అటవీశాఖ అధికారుల ముమ్మర‌ ఏర్పాట్లు

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి:

అదిగో పులి.. ఇదిగో పులి అంటూనే నెలలు గడిచాయి. ఎక్కడ ఎప్పుడు ఏవిధంగా దాడిచేస్తుందోనంటూ స్థానికులు ప్రతి నిత్యం భయంతో బెంబెలెత్తిపోతున్నారు. చిరుత కదలికలపై నిఘా పెట్టిన అటవీ ప్రాంతంలో ప్రత్యేక సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గురువారం రాత్రి చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ‌ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ మేరకు అటవీశాఖ అధికారులు చిరుతను ఏ విధంగా బోనులో బంధించాలనే కోణంలో పథకాలు రచిస్తున్నారు. శుక్రవారం అటవీప్రాంతంలో అధికారులు పర్యటించి‌ మరో సారి‌చిరుత కదలికలపై నిఘా పెట్టే అవకాశం ఉంది. ఎట్టకేలకు చిరుతను బంధీచేసే యత్నంలో అటవీశాఖ అధికారులు ముమ్మరంగా చర్యలు చేపట్టారు. గత కొన్ని‌ నెలలుగా మల్దకల్ మండలంలో సంచరిస్తున్న చిరుతను ఎట్టకేలకు ఫారెస్టు అధికారులు కనిపెట్టారు. మండలంలో ఆయా గ్రామాలల్లో మూగ జీవులపై గుర్తు తెలియని జంతువు దాడి చేసి అపహరించి ఎత్తుకెళ్తున్నట్లు గుర్తించారు. నేతువానిపల్లి గ్రామ శివారులోనే ఏకంగా 8 ఆవుదూడలు చిరుతదాడిలో మృతి చెందాయి. దీంతో బెంబేలెత్తిన గ్రామస్తులు చిరుతపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వ్యవసాయ పొలాలో పడిన కాళ్ల ముద్రల కొలతలు సేకరించిన అధికారులు ఇదీ కచ్చితంగా చిరుత జాడలే అని దృవీకరించారు. తాజాగ నేతువానిపల్లి గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు అనుమానించడంతో
చిరుత కదలికలను గమనించేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగ్గారు‌. ఈ మేరకు అటవీశాఖ అధికారులు ఆధ్వర్యంలో నేతువానిపల్లి అటవీ ప్రదేశంలో ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చనిపోయిన ఓ మూగ జీవిని అడవిలో వదిలేసి సీసీ కెమెరాల నిఘాలో పర్యవేక్షించారు. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ సీసీ కెమెరాలో చిరుతపులి సంచరిస్తున్న వీడియో రికార్డు అయ్యింది. మూగజీవిని తీసుకెళ్లే దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు చిరుతపులిని పట్టుకునేందుకు చర్యలు ముమ్మరం చేశారు. వీలైనంత త్వరగా చిరుతను బంధించే ప్రయత్నం చేస్తున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారులు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.