Take a fresh look at your lifestyle.

గాలికుంటు వ్యాధి రాకుండా పశువులకు టీకాలు వేయించాలి

  • సంగం గ్రామంలో గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా పశు వైద్యాధికారి.

తుంగతుర్తి, ముద్ర: రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ డి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం మండల పరిధిలోని సంగం గ్రామంలో పశు వైద్య అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు.గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు. ప్రభుత్వం పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి బారిన పడకుండా రక్షించుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా సంఘ్యం గ్రామంలో 143 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ ఏ నరేష్ వి ఏ రవి నాగరాజు గోపాలమిత్ర శ్రీనివాస్ రెడ్డి పశుమిత్ర గణిత లతోపాటు గ్రామ రైతాంగం పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.