- ఆర్డిఓ శ్రీను నాయక్.
ముద్ర ప్రతినిధి కల్వకుర్తి : భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన భూభారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని కల్వకుర్తి ఆర్డీవో శ్రీను నాయక్ అన్నారు.బుధవారం కల్వకుర్తి మండలం లిగసానిపల్లి వెంకటాపూర్ గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను ఆయన పరిశీలించి మాట్లాడారు.దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలు భవిష్యత్తులో ఉండొద్దనే ఉద్దేశంతో నూతన చట్టాన్ని తేవడం జరిగిందని రైతులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.భూ భారతి చట్టంపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. లింగస్వామి పల్లి లో 25, వెంకటాపూర్లో ఐదు ఫిర్యాదులు వచ్చాయని వాటిని పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్వో ఇబ్రహీం, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.