- కొనుగోలు చేసిన విత్తనాలకు రైతులు విధిగా బిల్లులు దుకాణదారుల నుండి తీసుకోవాలి.
- బి జి 3 పత్తి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు.
- తుంగతుర్తి నూతన ఏ డి ఏ ఎల్ రమేష్.
ముద్ర, తుంగతుర్తి: రైతులు నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని కొనుగోలు చేసిన విత్తనాలకు ఆయా దుకాణదారుల నుండి విధిగా బిల్లులు తీసుకోవాలని తుంగతుర్తి ఏ డి ఏ ఎల్ రమేష్ అన్నారు.బుధవారం నూతన ఏడీఏ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విత్తన దుకాణదారులు ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మకం చేసినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.రైతుల కోరిన విత్తనాలను అందజేసి బిల్లులు విధిగా ఇవ్వాలని అన్నారు.విత్తనాలు అమ్మకం చేసే దుకాణాల ముందు ఏ రకం విత్తనాలు అమ్ముతున్నారు తెలిపే సూచిక బోర్డులు తప్పనిసరిగా ఉండాలని అన్నారు.ఎవరైనా ఇతర ప్రాంతాల వారు నకిలీ విత్తనాలను గ్రామాల్లో అమ్మినట్లయితే వారి వివరాలను వ్యవసాయ శాఖ అధికారులకు అందించాలని కోరారు. రైతులు బి జి 3 విత్తనాలను కొనుగోలు చేయరాదని తద్వారా భూమి సారం కోల్పోవడమే కాకుండా రైతులు అనారోగ్య బారిన పడతారని అన్నారు. అలాంటి విత్తనాలు అమ్మే వారి వివరాలను అధికారులకు తెలపాల్సి ఉంటుందని సూచించారు. ఈ సమావేశంలో తుంగతుర్తి ఏవో బాలకృష్ణ పాల్గొన్నారు.