- తొమ్మిది శాతం రిజర్వేషన్ రాష్ట్రవ్యాప్తంగా మాదిగలకు సంతోషదాయకం.
- రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు డాక్టర్ పిడమర్తి రవి.
తుంగతుర్తి, ముద్ర: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలకు 9% రిజర్వేషన్ ప్రకటించడం పట్ల రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో హర్షం వ్యక్తం చేస్తూ సీట్లు పంపిణీ చేశారు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా మాదిగల రిజర్వేషన్ అమలుచేసి ఘనత చాటుకుందని అన్నారు.ఇందుకుగాను రాష్ట్రవ్యాప్తంగా మాదిగలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పెద్ద బోయిన అజయ్ వక్కల గడ్డ చంద్రశేఖర్ మీసాల మహేష్ వీరబోయిన గంగరాజు యాదవ్ ఉప్పుల రాంబాబు వీరబోయిన లింగమల్లు రాములు శ్రీశైలం శ్రీను పరుశురాములు మామిడి నరేష్ రాజు అనిల్ జీవన్ తదితరులు పాల్గొన్నారు.