- అట్టహాసంగా ముగింపు కార్యక్రమం
- 13 రాష్ట్రాలు, 19 దేశాల నుంచి 1300 మంది కైట్ ప్లేయర్స్
- 1200 స్టాల్స్ ఏర్పాటు
- ఉత్సవాలను తిలకించిన 15లక్షలకు పైగా మంది
ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన అంతర్జాతీయ కైట్స్ అండ్ స్వీట్స్ -2025 ఫెస్టివల్ ప్రపంచ దేశాలను ఆకర్శించిందని తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ వెన్నెల గద్దర్ చెప్పారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 13 నుంచి నిర్వహించిన ఈ ఉత్సవాలు బుధవారం అట్టహాసంగా ముగిశాయి.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెన్నెల.. దేశంలోని 13 రాష్ట్రలు అలాగే 19 దేశాల కైట్ ప్రేయర్స్ ఈ ఉత్సవం లో పాల్గొన్నారని, 1200 స్టాల్స్ ఏర్పాటు చేయడంతో 15 లక్షలకు పైగా ప్రజలు తిలకించినట్లు చెప్పారు. దేశంలో ముఖ్యంగా తెలంగాణకు ఎంతో ప్రాధాన్యత ఉందన్న ఆమె.. కైట్స్ అండ్ స్వీట్స్ ఉత్సవాలు రాష్ట్ర ప్రాధాన్యతను మరింతగా పెంచాయన్నారు. అన్ని శాఖల సహకారం, సమన్వయము తో ఈ ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు వివరించారు.
ఇందుకు సహకరించిన అన్ని శాఖలు, విభాగాల అధికారులు, ఉద్యోగులు, వివిధ ప్రాంతాలు, దేశాల నుంచి విచ్చేసిన ప్రజలకు కృతజ్ఙతలు తెలిపారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు.. ప్రముఖ గాయని మంగ్లీ సత్యవతి పాడిన పాటలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.ఈ పోటీల్లో వివిద దేశాలకు చెందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ కైట్ ప్రేయర్స్ లను ఘనంగా సన్మానించిన టూరిజం కార్యదర్శి స్మిత సభర్వాల్ వారికి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డి సి పి రష్మి పరిమళ, టూరిజం సంచాలకులు జెడ్ కె హనుమంతు, భాషా సంస్క్రతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, టూరిజం శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మహేష్, మెడికల్ శాఖ, జీహెచ్ఎంసీ. పోలీస్ శాఖ, ఆర్ అండ్ బి, మెట్రో, వాటర్ సప్లై శాఖ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.