Take a fresh look at your lifestyle.

భారత ఆర్మీ క్షేమం కోరుతూ ప్రత్యేక పూజలు

కోరుట్ల/కథలాపూర్, ముద్ర విలేకరి:  భారత ఆర్మీ క్షేమం కోరుతూ కథలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాయతి నాగరాజ్ ఆధ్వర్యంలో శనివారం రోజు మండలం లోని దుంపేట గ్రామంలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో పార్టీ కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.వారు మాట్లాడుతూ ఉగ్రవాదం అనే భూతాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తూ, సమయం దొరికినప్పుడల్లా భారతదేశo పై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుందన్నారు. అలాంటి ఉగ్రవాదాన్ని సమూలంగా భూస్థాపితం చేయడానికి మన భారత ఆర్మీకి దేవుడు ఆయురారోగ్యాలు అలాగే ప్రత్యర్థిని ఎదుర్కొనుటకు, కావలసిన మనోధైర్యాన్ని, అందించి భారతదేశాన్ని విజయపథంలో నిలపాలని ఎవరైతే యుద్ధంలో అమరులయ్యారో వారి కుటుంబాలకు ఆ భగవంతుడు ఓదార్పును కలిగించాలని, ఈ సందర్భంగా ఆ స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు, ఇట్టి పూజ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పుండ్ర నారాయణరెడ్డి, మండల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేగ్యారపు శ్రీహరి, కాంగ్రెస్ జిల్లా కార్యవర్గ సభ్యుడు ధనుంజయ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు లింగ గౌడ్, మండల సోషల్ మీడియా కన్వీనర్ కూన అశోక్, అంగ మహేష్ ఏం. డి మొయినోద్దీన్, తీగల రాజారెడ్డి, ఆకుల పెద్ద గంగరెడ్డి, శ్రీరాముల రవి, తీగల నరేష్ రెడ్డి, ఏఏంసీ డైరెక్టర్ జవ్వాజి చౌదరి, మండల, గ్రామ స్థాయి, వివిధ హోదాలు కలిగిన నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.