ముద్ర. తాండూర్: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇందిరానగర్ లోని గుండు పీర్ల దగ్గర వార్డ్ నెంబర్1,2,3,4,5,6,24,25, అభ్యర్థులకు మద్దతుగా స్వీట్ కార్నర్ మీటింగ్ లో కలసి పాల్గొన్న తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలన్నీ దశలవారీగా నెరవేరుస్తామని వారు పేర్కొన్నారు. అదేవిధంగా తాండూర్ ప్రాంత అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారని, అందుకు నిదర్శనమే నిన్న జరిగిన పరిగి సభలో తాండూర్ ప్రాంత అభివృద్ధికి వంద కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి కేటాయించారని, ఆ నిధులతో మున్సిపల్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిధులు మంజూరు చేయనున్నట్లు, అలాగే శివాజీ చౌక్ నుండి మల్రెడ్డిపల్లి వరకు 2 కోట్లతో రోడ్డు నిర్మాణం జరిగిందని చెప్పారు. చిలకవాగు, గొల్ల చెరువు, పాత తాండూర్ రైల్వే బ్రిడ్జి పనులు చేపట్టడం జరుగుతుందనీ వారు తెలిపారు. తాండూరు నియోజకవర్గనికి దాదాపుగా 500 ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయడం జరిగిందని, కావున తాండూర్ మున్సిపల్ పరిధిలోని కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డిసిసిబి అధ్యక్షులు ధారా సింగ్, సీనియర్ నాయకులు స్వప్న పరిమళ, కౌన్సిలర్ అభ్యర్థులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.