- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : హెచ్ సీయూలో నరికిన చెట్లకు శ్రమదానంతోనే ప్రాయశ్చిత్తం చేయాలని, అక్కడ సీఎం సహా మంత్రులందరూ కలిసి మొక్కలను నాటాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నరికిన చెట్లకు ఆ పార్టీ నేతలు చెమటోడ్చి ప్రాణం పోయాలన్నారు.ఈ విధ్వంసానికి బాధ్యులనైన వారందరూ ప్రజలకు క్షమాపన చెప్పాలన్నారు.రాష్ట్రంలో పచ్చదనం కోసం పోరాటం చేసే యువత ఆగ్రహంతో ఉన్నారని, మొక్కలను తిరిగి నాటి ప్రజల్లో గౌరవం పొందాలని ఆయన హితవు పలికారు.