Take a fresh look at your lifestyle.

ఆపరేషన్ సిందూర్ సక్సెస్ పై న్యాయవాదుల సంఘీభావం

కోరుట్ల, ముద్ర విలేకరి: కాశ్మీర్‌లోని పహాల్గాంలో ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌తో పాటు పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ సైనికులు ఆపరేషన్‌ సిందూర్‌ నిర్వహించి, ఉగ్రవాద శిబిరాలను సర్వనాశనం చేసిందని, ఈ సక్సెస్‌ భారత్‌ సైనికులకు అంకితమని కోరుట్ల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బైరి విజయ్ కుమార్ అన్నారు. భారత సైనికులు చేసిన ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా గురువారం జగిత్యాల జిల్లా కోరుట్లలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించారు. భారత్ – పాక్ మధ్య జరుగుతున్న ఆపరేషన్ సిందూర్ లో భారత సైన్యం చూపిస్తున్న శౌర్యానికి సంఘీభావం తెలుపుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు.కోర్టు నుంచి జాతీయ రహదారి వెంబడి బైకులపై న్యాయవాదులు జాతీయ జెండాలు పట్టుకొని దేశభక్తి నినాదాలు చేస్తూ ప్రధాన కూడళ్ల వద్ద బాణా సంచా కాల్చారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బైరి విజయ్ కుమార్ మాట్లాడుతూ పాకిస్థాన్ లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసిందని తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే క్రమంలో దేశ రక్షణకు ఇది కీలకమైన అడుగని పేర్కొన్నారు. ఆర్మీ వీరులు ధైర్య సాహసాలకు ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూర్ నిలుస్తుందని మునుముందు భారత సైన్యం తీసుకునే చర్యలు ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కోరుట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు బైరి విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు కస్తూరి రమేష్, జనరల్ సెక్రటరీ కొంపల్లి సురేష్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రెటరీ సుతారి నవీన్ కుమార్, ఫసియోద్దీన్, లైబ్రరీ సెక్రెటరీ మర్రిపల్లి గంగాధర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ రాసభక్తుల రాజశేఖర్, సీనియర్ న్యాయవాదులు గండ్ర ప్రవీణ్ కుమార్, తోకల రమేష్, ఆడెపు వినోద్, గాంధారి శ్రీనివాస్, జూనియర్ నాయవాదులు అల్లె రాము, బద్రి సృజన్, లావుడ్య రాకేష్, గణేష్, వివేక్, శ్రీనివాస్, అనిల్, రాజు, రాజేందర్, రమేష్, శివకుమార్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.