Take a fresh look at your lifestyle.

చెరువుల అభివృద్ధి పనులు పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ నగర పరిధిలో పలు చెరువుల అభివృద్ధి పనులు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా పరిశీలిస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం ఆయన బతుకమ్మ కుంటను పరిశీలించారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజల నుంచి సూచనలు, సలహాలను ఆయన స్వీకరించారు. బతుకమ్మ కుంటకు తిరిగి ప్రాణం పోసారంటూ రంగనాథ్‌కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.స్థానికుల కోరిక మేరకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఎక్కడ చేపట్టాలనే విషయాన్ని పరిశీలించారు. బతుకమ్మ కుంట పక్కన సాగే మురుగు, వరద కాలువ డైవర్షన్ పనులను తనికి చేశారు. అలాగే పాతబస్తీలోని భమ్రుక్నుదౌలా చెరువు పనులను కమలహాసన్ రంగనాథ్ పరిశీలించారు. ఈ చెరువు 18 ఎకరాల అసలు విస్తీర్ణం కాగా 9 ఎకరాల మేర మట్టి నింపి ఆక్రమించారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా ఆ 9 ఎకరాల్లో మట్టిని తొలగించి చెరువును పునరుద్దరిస్తోంది. ఈ సందర్బంగా స్థానికులు కమిషనర్ రంగనాథ్‌ను కలిసి చెరువు వద్ద పిల్లలు ఆడుకోవడానికి పార్కును నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.