మాదాపూర్, ముద్ర విలేఖరి: శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని కమల ప్రసన్న నగర్, మెడికల్ సొసైటీ, కుమ్మరి బస్తి కాలనీలలో రూ.35.00 లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ రోజాదేవి రంగరావు మరియు జలమండలి అధికారులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన పీయేసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ.ఈ సందర్భంగా పీయేసీ చైర్మన్ గాంధీ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని, పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మెరకు మరియు మా కార్పొరేటర్లు మా దృష్టికి తెచ్చన సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో ఈ రోజు కమల ప్రసన్న నగర్,మెడికల్ సొసైటీ, కుమ్మరి బస్తి కాలనీలలో శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని చైర్మన్ గాంధీ అన్నారు.అత్యవసరం ఉన్న చోట, నిత్యం నాలాలు పొంగుతున్న ప్రాంతాలలో ప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని, ఏ చిన్న సమస్య అయిన నా దృష్టికి వచ్చిన తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ, కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతూ సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీ లు గా తీర్చిదిద్దడమే ప్రథమ లక్ష్యం స్పష్టం చేశారు. కమల ప్రసన్న నగర్, మెడికల్ సొసైటీ, కుమ్మరి బస్తి కాలనీల లో గల ఎన్నో ఏండ్ల సమస్యకు డ్రైనేజీ నిర్మాణంతో పరిష్కారం లభిస్తుందని, నిత్యం పొంగుతుండటం వలన కాలనీ వాసులు,ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని, అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని గాంధీ హామీ ఇచ్చారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని, సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకం లో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానన్నారు.ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు మేనేజర్లు ప్రియాంక, ఝాన్సీ మరియు నాయకులు కార్యకర్తలు,కాలనీ వాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
