Take a fresh look at your lifestyle.

గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారుడికి అక్షర స్కూల్ యాజమాన్యం సన్మానం

 

ముద్ర, తాండూర్:
అంతర్జాతీయ స్థాయిలో భారత జెండాను ఎగరవేసిన యువ క్రీడాకారుడు మోహిజ్‌కు తాండూర్ పట్టణంలోని అక్షర పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించడం జరిగింది. తాండూర్ పట్టణానికి చెందిన యువ క్రీడాకారుడు మోయిజ్
నేపాల్ దేశ రాజధాని ఖాట్మండు నగరంలో నిర్వహించిన అంతర్జాతీయ షూటింగ్ బాల్ పోటీలలో భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన మోహిజ్, అద్భుత ప్రతిభ కనబరచి జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించి గోల్డ్ మెడల్ సాధించాడు. మొత్తం ఐదు మ్యాచ్‌లలో భారత జట్టు విజయం సాధించడం చాలా గొప్ప విషయం.
ఈ విజయోత్సాహంలో భాగంగా, తాండూర్‌లోని అక్షర పాఠశాల ఆధ్వర్యంలో మోహిజ్‌కు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం అతనికి శాలువా, పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించడమే కాకుండా, ఆర్థిక ప్రోత్సాహాన్ని కూడా అందించింది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ మోహన కృష్ణ గౌడ్ గ మాట్లాడుతూ,
“మోహిజ్ సాధించిన విజయం కేవలం అతని వ్యక్తిగత విజయమే కాదు, తాండూర్ పట్టణం మరియు మన రాష్ట్రానికి గర్వకారణం. కఠోర శ్రమ, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఏ స్థాయికైనా ఎదగవచ్చని మోహిజ్ నిరూపించాడని, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని, దేశానికి మరిన్ని పతకాలు అందించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము” అని పేర్కొన్నారు.
అలాగే ఆయన మాట్లాడుతూ, పాఠశాలల్లో విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యమని, క్రీడల ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ధైర్యం, మరియు సమయపాలన పెరుగుతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య సభ్యులు శ్రీ C. ప్ర‌వీణ్ కుమార్, శ్రీ శ్రీకాంత్ కులకర్ణి, శ్రీ రవీందర్ రెడ్డి, శ్రీ MD యూనస్, శ్రీమతి శోభా రాణి మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.