Take a fresh look at your lifestyle.

ఆనందోత్సాహాల మధ్య దసరా ప్రీతి మిలన్

  • రాష్ట్ర నకాష్ సంఘం అలయ్.. బలయ్

బోడుప్పల్, ముద్ర ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ కేంద్రంలోని రాష్ట్ర నకాష్ సంఘం అత్యంత ఉత్సాహభరితంగా ఆదివారం దసరా ప్రీతి మిలన్ – అలయ్.. బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. నకాష్ బంధువుల మధ్య ఐకమత్యం, ప్రేమ, సత్సంబంధాలను పెంపొందించడంతో పాటు, భవిష్యత్తు తరాలకు కులవృత్తి, సంస్కృతి సంప్రదాయాలను వివరించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

గత కొన్నేళ్లుగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర నకాష్ సంఘం నిర్వహిస్తోంది. బోడుప్పల్ పెంటారెడ్డి కాలనీలోని శ్రీ మాతా నిమిషాంబికా ఆలయంలోని నిమిషాంబ భవన్ లో ఈ కార్యక్రమాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా  బాలబాలికలు, మహిళలకు క్రీడల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. నకాష్ బంధువులు పెద్దఎత్తున హాజరయ్యారు. మాజీ కార్పొరేటర్లు చీరల నరసింహ, సామల పవన్ రెడ్డి, రాచర్ల కేశవరావు హాజరయ్యారు. నకాష్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.అశోక్ కుమార్, అసోసియేట్ అధ్యక్షుడు, కొరిచర్ల శ్రీనివాస్ రావు, (కేఎస్ఆర్), సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నిమిషాంబ ఆలయ చైర్మన్ కామరౌతు వినోద్ కుమార్, సహాయ కోశాధికారి ధనలకోట సతీష్, ఉపాధ్యక్షులు ధనలకోట నర్సింగ్ రావు, హిమచందర్, రఘు రామ్, రాజేందర్, శ్రీధర్, కార్యదర్శులు రామగిరి శ్రీకాంత్, ముత్యాల శ్రీనివాస్, నాంపల్లి శ్రీకాంత్, నానాగిరి రామకృష్ణ, ఎమ్. శ్యామ్, డి. రామకృష్ణ, డి. నరేష్, కె. ప్రవీణ్ కుమార్, వెంకట్ రాజారావు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.