బీబీనగర్, ముద్ర ప్రతినిధి: బీబీనగర్ లోని అఖిల బారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో శుక్రవారం వన్ హెల్త్ పై సెమినార్ జరిగింది. మానవులు, జంతువులు, పర్యావరణ ఆరోగ్యానికి సంబంధించిన ఈ వన్ హెల్త్ ప్రోగ్రామ్ లో మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈ సెమినార్ జరిగింది. మైక్రోబయాలజీ విభాగం ప్రొఫెసర్, విభాగాధిపతి డాక్టర్ రాహుల్ నారంగ్ ప్రారంభోపన్యాసం చేశారు. పీడియాట్రిక్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మౌనికా రెడ్డి, వ్యాధుల వ్యాప్తి, పీడియాట్రిషియన్ దృక్పథంపై ప్రసంగించారు, వ్యాప్తి పరిస్థితులలో బహుళ విభాగ విధానం అవసరాన్ని హైలైట్ చేశారు. ఐసీఏఆర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ దీప్ రావూల్ జునోటిక్ వ్యాధులు, వన్ హెల్త్ ఆవశ్యకతను వివరించారు.
మెడిసిన్ విభాగం అదనపు ప్రొఫెసర్, విభాగాధిపతి డాక్టర్ విశాక జైన్ జునోసిస్ వ్యాధులు, వాటి నివారణకు
ముందస్తు జాగ్రత్తలను వివరించారు. యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్ డీపీ) రాష్ట్ర ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ జ్యోత్స్న మహమ్మారుల సందర్భంలో చేయాల్సిన పరిశోధనలు, వన్ హెల్త్ ప్రోగ్రామ్ నిర్వహణకు సంబంధించి మాట్లాడారు. మైక్రోబయాలజీ విభాగం అదనపు ప్రొఫెసర్ డాక్టర్ టి. లక్ష్మీజ్యోతి, జూ హెల్త్ వర్కర్లలో వన్ హెల్త్ అప్రోచ్ గురించి వివరించారు. కార్యక్రం ముగింపు మరియు అభిప్రాయ సెషన్‌కు ఎయిమ్స్ మైక్రోబయాలజీ విభాగం అదనపు ప్రొఫెసర్ డాక్టర్ ఆర్. శ్యామల అయ్యర్ నాయకత్వం వహించారు.
ఈ ర్క్‌షాప్‌ను ఎయిమ్స్ బీబీనగర్‌లోని మైక్రోబయాలజీ విభాగం అదనపు ప్రొఫెసర్ డాక్టర్ ఆర్. శ్యామల సమన్వయం చేశారు, ఆమె ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశారు, మైక్రోబయాలజీ విభాగం అధ్యాపక బృందంతో పాటు. వివిధ విభాగాల నుంచి ఫ్యాకల్టీ సభ్యులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు.