Take a fresh look at your lifestyle.

20,47,000 రూపాయల చెక్కులను పంపిణీ చేసిన పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ

మాదాపూర్, ముద్ర విలేఖరి:  శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా 43 మంది లబ్ధిదారులకు సి.ఎం. ఆర్.ఎఫ్ ద్వార మంజూరైన రూ.20,47,000 ఇరవై  లక్షల నలబై ఏడు వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన సి.ఎం. ఆర్.ఎఫ్ చెక్కులను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో  కలిసి బాధిత కుటుంబాలకి అందచేసిన పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ.ఈ సందర్భంగా చైర్మన్  గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరం అని ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు పేదల పక్షపాతి అని PAC చైర్మన్ గాంధీ గారు పునరుద్గాటించారు.అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి  నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని చైర్మన్ గాంధీ తెలియచేశారు.

పేద మధ్యతరగతి ప్రజలకు ఆసుపత్రిలో బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ ఆర్థిక సాయం అందిస్తుందని, దీనిలో భాగంగానే నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్నో వందలాది కుటుంబాలను ఐ.ఎం. ఆర్.ఎఫ్ ద్వారా ఆదుకున్నామని తెలిపారు.గతంలో ఉన్న బిల్లులకు అనుగుణంగానే ప్రస్తుతం ఆర్థిక సాయం అందిస్తుందని దానిని మరింత పెంచేలా కృషి చేసేందుకు గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి త్వరలోనే కలిసి వినతి పత్రాన్ని అందజేస్తానని, మరింత ఆర్థిక సహాయం పెంచితే పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని పీయేసీ చైర్మన్ గాంధీ అన్నారు.ఈ సందర్భంగా  వైద్య చికిత్స కి సహకారం అందించిన  పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ  ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము అని బాధితుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, నాయి నేనీ చంద్రకాంత్ రావు, సాంబశివరావు, మంత్రిప్రగడ సత్యనారాయణ,పోతుల రాజేందర్, ఇబ్రహీం, కావూరి అనిల్, నాగేశ్వరరావు, మోజేశ్, ఇజ్రాయిల్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.