Take a fresh look at your lifestyle.

వాట్సాప్ గ్రూపులో టెన్త్ ప్రశ్నలు పోస్ట్ చేసినందుకు అడ్మిన్ అరెస్ట్

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: విచ్చలవిడిగా వాట్సాప్ గ్రూప్ లను క్రియేట్ చేసి కొనసాగిస్తున్న వారికి ఇదో హెచ్చరిక. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ కేంద్రంలో గత 26న జరిగిన టెన్త్ మ్యాథ్స్ పరీక్ష కు సంబంధించిన పేపర్లోని కొన్ని ప్రశ్నలను ఓ విద్యార్థి ఓ పేపర్ పై రాసి బయటకు పంపగా, ఆ ప్రశ్నలను ఓ డిజిటల్ మీడియా విలేకరి వార్త క్లిప్ తయారు చేసి “జుక్కల్ నియోజకవర్గ సమస్యలు” అనే వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశారు. అయితే పరీక్ష కొనసాగుతున్న సమయంలోనే ప్రశ్నలు వాట్సాప్ లో చక్కర్లు కొట్టడంతో పోలీసులు గ్రూప్ అడ్మిన్ ను అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. జుక్కల్ పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన టెన్త్ మాల్ ప్రాక్టీస్ కేసులో కీలక పాత్ర పోషించిన (6) ఆరుగురిని గతంలో అరెస్టు చేయడం జరిగింది. శనివారం పరార్ లో ఉన్న మరో నిందితుడు అయినా నయీమ్ ఖాన్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్పి రాజేష్ చంద్ర తెలిపారు. నయీమ్ ఖాన్ “జుక్కల్ నియోజక వర్గ సమస్యలు’ వాట్స్ యాప్ గ్రూప్‌లో గ్రూపుని క్రియేట్ చేసి దానికి అడ్మిన్ గా వ్యవహరిస్తున్నాడు. 26న పదో తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ ప్రయత్నించిన వ్యవహారం లో ఓ విలేకరి వాట్స్ యాప్ గ్రూప్‌లో 5 ప్రశ్నల లీకేజీకి సంబంధించి విషయంలో ఒక క్లిప్‌ను తయారు చేసి “జుక్కల్ నియోజక వర్గ సమస్యలు” వాట్స్ అప్ గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. గ్రూపులో పోస్ట్ ను చూసి కూడా ఎగ్జామ్ నడుస్తున్న సమయంలో దానివలన విద్యార్థులకు వారి భవిష్యత్తుకు ప్రమాదం ఉన్నదని తెలిసి కూడా ఆ పోస్ట్ ను వైరల్ కావడానికి దోహదపడ్డాడని ఎస్పీ తెలిపారు. వాట్స్ అప్ గ్రూప్‌ అడ్మిన్ గా ఉన్న నయీం అ పోస్ట్ ను వాట్స్ అప్ గ్రూప్‌ నుండి తొలగించలేకపోయాడని, వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం కూడా ఇవ్వలేదని అందుకే అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

  • వివాదాస్పద పోస్టులకు అడ్మిన్ బాధ్యులు

సామాజిక మాధ్యమాలు అయిన Facebook, Twitter, ఇంస్టాగ్రామ్, వాట్సప్ గ్రూపులలో ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా, ఒక వర్గానికి కించపరిచే విధంగా ఉన్న, తమకు తెలియని వీడియోలు, ఫోటోలు పోస్టులు చేసిన, వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేసిన ఆ గ్రూపు అడ్మిన్ నీ బాధ్యుడిగా చేస్తూ, ఫార్వర్డ్ చేసిన వారిపైన కేసులు నమోదు చేయబడుతాయని తెలిపారు. సోషల్ మీడియా ను చట్ట పరిమితులకు లోబడి వినియోగించాలి తప్ప చట్ట వ్యతిరేకముగా, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధముగా ఎవరైనా ప్రయత్నిస్తే చట్టప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతాయని జిల్లా యస్ పి పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.