జిల్లా సమాఖ్య ద్వారా లర్నింగ్, వన్ స్టాప్ ఫెసిలిటి సెంటర్ అభివృద్ధి పై సమీక్ష…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలని రాష్ట్ర సెర్ప్ సీనియర్ మేనేజర్ డి. కల్పన అన్నారు. తెలంగాణ రాష్ట్ర పేదరిక నిర్ములన సంస్థ సెర్ప్ ఆధ్వర్యంలో జిల్లా సమాఖ్యల ద్వారా స్వశక్తి సంఘాల సభ్యులకు లర్నింగ్, వన్ స్టాప్ ఫెసిలిటి సెంటర్ అభివృద్ధి పై జిల్లా సమాఖ్య సభ్యులు, జిల్లా సెర్ప్ సిబ్బందితో జిల్లా డి.ఆర్.డి.ఓ కార్యాలయం లో బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్ లో నిర్మిస్తున్న జిల్లా సమాఖ్య కార్యాలయ సముదయాన్ని జిల్లా DRDO యం.రఘువరణ్, EE PR లక్ష్మణ రావు, అడిషనల్ Drdo పి. సునీతతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలల్లో మహిళా శక్తి భవనాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసి నిర్మాణాలు చేయడం జరుగుతుందని, ఈ భవనాల వలన మహిళా సంఘాలకు వివిధ శిక్షణ లు ఇవ్వడం, వారికీ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఉపయోగపడుతాయని అన్నారు. తర్వాత జిల్లా సమావేశం మందిరంలో ప్రత్యేక సమావేశంలో జిల్లాలోని ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ఉత్తమ యూనిట్ నిర్వహకులతో ముఖాముఖీ కార్యక్రమంలో ఆయా యూనిట్ల పనీతిరు, వారి అనుభవాలు, వారికీ ఇంకా కావాలసిన శిక్షణలు, సదుపాయాలు తదితర అంశాలను అడిగి తెలుసుకొన్నారు. సెర్ప్ ద్వారా ఆయా జిల్లాలో సభ్యుల నుండి అనుభవాలు, సలహాలు, సూచనలు సేకరించడం జరుగుతుందని, జిల్లా కార్యాలయ సిబ్బంది తో మాట్లాడుతు ఆయా వింగ్ లకు కావాల్సిన శిక్షణలు, సదుపాయాలపై అడిగి తెలుసుకొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిపియం లు రమేష్, నారాయణ, నాగేశ్వర్ రావ్, జిల్లా ఏపీఎం లు గంగాధర్, చక్రవర్తి, త్రివేణి, హుస్సేన్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సరోజన, కార్యదర్శి ఆమనీ, కోశాధికారి హరిత, సీ. సీ. సత్యనారాయణ, ఆయా యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.