Take a fresh look at your lifestyle.

బంగారు పథకం సాధించడం గర్వకారణం

ముద్ర, మధిర : మైసూర్ దత్త పీఠం వారు నిర్వహించిన భగవద్గీత కంఠస్థ పోటీలలో పాల్గొని అమరా చంద్రకళ బంగారు పథకం సాధించడం గర్వకారణం అని పలువురు మహిళలు పేర్కొన్నారు. భగవద్గీత కంఠస్థ పోటీలలో బంగారు పధకం సాధించిన చంద్రకళను శనివారం ఆమె స్నేహితులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమతో కలిసి ఉండే చంద్రకళ భగవద్గీత కంఠస్థ పోటీలలో పాల్గొని బంగారు పతకం సాధించడం మహిళా లోకానికే గర్వకారణమన్నారు. బంగారు పతక గ్రహీత మాట్లాడుతూ కృష్ణ పరమాత్మ ఆశీస్సులతో బంగారు పతకం సాధించడం జరిగిందన్నారు. ఈ భగవద్గీత కంఠస్థ పోటీలలో పాల్గొనటంలో సహకరించిన పద్మ ఏలూరి, లక్ష్మీ సుమతి, గీతా మకరందం టీం ఉపాధ్యాయులకు ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో లగడపాటి రాధ, ఊట్ల సత్యవతి, కూరపాటి సీతామహాలక్ష్మి, మాధవరపు గాయత్రి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.