Take a fresh look at your lifestyle.

ప్రపంచంలో ఎక్కడ జరగని సాంస్కృతిక ప్రదర్శన ఫిబ్రవరి 7 తేదిన హైదరాబాద్ లో జరగనుంది : పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ప్రపంచంలో ఎక్కడ జరగని సాంస్కృతిక ప్రదర్శన ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరగనుందని పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ అన్నారు. శుక్రవారం యదాద్రి భువనగిరి జిల్లా సన్నాహక డప్పుల ప్రదర్శన, సభకు ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ అధ్యక్షతన స్థానిక ప్రిన్స్ చౌరస్తా వద్ద జరిగిన సభ కి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మన ఆవేదన మన గోడు ఈ ప్రభుత్వానికి వినిపించేందుకు లక్షల డప్పులతో సిద్ధం అవుతున్నామన్నారు.
గ్రామాలలో, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలంటే డప్పే ముఖ్యమని లక్షల డప్పుల గుండె చప్పుడు ప్రభుత్వం వింటే మంచిది లేకుంటే భవిష్యత్తును వారే తేల్చుకోవాలన్నారు.
హైదరాబాద్ సాంస్కృతిక ప్రదర్శన వచ్చే ప్రతి ఒక్కరు డప్పుతోనే రావాలని పిలుపునిచ్చారు.
వర్గీకరణ ముందుగా అమలు చేస్తా అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరి మాటలకి తలవొగ్గి వర్గీకరణ అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
ఆశలు నిరాశాలు చేసి ఉద్యోగులను భర్తీ చేస్తున్నారని మండిపడ్డారు.
వర్గీకరణ అమలు చేయకుండా, ఉద్యోగాలు భర్తీ చేస్తుండని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్.సి వర్గీకరణ అడ్డుకుంటుంది మాలలలోని కొంతమంది స్వార్ధపారులని వాళ్లకు అంత శక్తి ఎలా వచ్చిందన్నారు.
వర్గీకరణకు అనుకూలంగా మూడు కమీషన్లు తీర్పు ఇచ్చి వర్గీకరణ అనుకూలంగా మూడు సార్లు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారని చెప్పారు. ఎస్.సి వర్గీకరణ అడ్డుతగులుతుంది కాంగ్రెస్ పార్టీలోని మాలలే అన్నారు.
బీసీలకు నాయకత్వం వహించిన ఆర్ కృష్ణయ్య పది ఏండ్ల లో నాలుగు కండువాలు మార్చాడు పదవులు వచ్చాయి అన్నారు.
ముప్పైఆరు సంవత్సరాలుగా ఏ పదవి తీసుకోలేదు, ఏ కండువా మార్చలేదన్నారు. అన్ని పార్టీలు ,అందరూ ప్రధానమంత్రులు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నా అడ్డుకుంటుంది కాంగ్రెస్ పార్టీలోని మాలలే అన్నారు.
ముల్లు అంనతరాములు , జి వెంకటస్వామి కుటుంబలే వర్గీకరణ అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తుంది మాలలేనే కాంగ్రెస్ పార్టీలో సోనియాగాంధీ తర్వాత ఏకకాలంలో మూడు పదవులు తెచ్చుకున్న వారు మాలలే అని అది జి.వెంకట్ స్వామి కుటుంబం అన్నారు.
ఎస్.సి వర్గీకరణ చేస్తే అమలు చేస్తే రేవంత్ రెడ్డి నీ పదవి తీసేస్తాం అని కాంగ్రెస్ పార్టీలోని మాలలు బెదిరిస్తున్నారని చెప్పారు.
ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరిగే వేల గొంతులు లక్షల డప్పుల ప్రదర్శన కి లక్షల లాదిగా డప్పులతో హైదరాబాద్ కి తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సహాయ కార్యదర్శి ఇటుకల దేవేందర్ మాదిగ, ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు నల్ల చంద్రస్వామి మాదిగ, సీనియర్ నాయకులు సందేల శ్రీనివాస్ మాదిగ, మంద శంకర్ మాదిగ, మీసాల గణేష్,దుబ్బ దానయ్య మాదిగ ,బోయ లింగస్వామి మాదిగ, జేరిపోతుల కరుణాకర్ మాదిగ, కొల్లూరి హరీష్ మాదిగ కోళ్ల జహంగీర్ మాదిగ ,నాగరం అంజయ్య మాదిగ బండారు రవివర్ధన్ మాదిగ ,బట్టు రామచంద్రయ్య మాదిగ బర్రె జహంగీర్, వేముల అశోక్ ,కనుకుంట్ల జయ ,రేణుక , నరికడప మధు మాదిగ ,సిర్పంగా సుభాష్ సిర్పంగా శివలింగం ,గందమల్ల మనోజ్ మాదిగ కొల్లూరి రాజు, దర్గాయి హరిప్రసాద్, బండారు శివశంకర్ మాదిగ ,కనుకుంట్ల రమేష్ కోటి, మెడి కొటేష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.