- అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులకు వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి మెడికల్ ఇన్వాలిడేషన్ చేయండి.
- హయ్యర్ రెఫరల్ మెడికల్ కు పంపిన కార్మికులను మెడికల్ బోర్డు కు పిలవాలి.
- ఏరియా ఆసుపత్రుల్లో అన్ని రోగాల సంబంధించిన డాక్టర్ లను వెంటనే నియమించాలి.
- సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ తో మాట్లాడిన గుర్తింపు సంఘం ఏఐటియుసి అద్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య.
ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: సింగరేణిలో గత నాలుగు నెలలు గా పెండింగ్ లో ఉన్న మెడికల్ బోర్డు ను వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ కొత్తగూడెం లో చీప్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ తో మాట్లాడ్డం జరిగిందని గుర్తింపు సంఘం ఏఐటియుసి అద్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఒక ప్రకటన లో పేర్కొన్నారు.సింగరేణి లో వివిధ రకాల వ్యాధులతో చాలా మంది కార్మికులు అనేక అవస్థలు పడుతున్నారని,తీవ్ర అనారోగ్యం తో వారు విధులు నిర్వహించడం లేదని,వివిధ కారణాల వల్ల గత నాలుగు నెలలుగా నిలిచిపోయిన మెడికల్ బోర్డు ను వెంటనే ఏర్పాటు చేయాలని, అదేవిధంగా వివిధ కారణాల వల్ల హయ్యర్ రెఫరల్ మెడికల్ కు పంపిన కార్మికులకు కూడా మెడికల్ బోర్డు కు పిలవాలని కోరడం జరిగిందని ఆయన అన్నారు.అన్ని రకాల మెడిసిన్స్ హాస్పిటల్ లో ఉంచి పేషేంట్లకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని,అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన డాక్టర్ లను భర్తీ చేయాలని సి.ఎం.ఓ ను కోరడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భం గా సి.ఎం.ఓ స్పందించి ఈ నెలలో మెడికల్ బోర్డు ను ఏర్పాటు చేస్తామని,మిగతా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్,నాయకులు సలేంద్ర సత్యనారాయణ,బి.సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.