ముద్ర, గండిపేట్ : గండిపేట్ మండల పరిధిలోని నార్సింగి మున్సిపాలిటీ గౌలిదొడ్డి వీర శివ లింగాయత్ గౌలి శివుని దేవాలయ ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జాకు పాల్పడుతున్నారని రాజేంద్రనగర్ నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ తోకల శ్రీనివాస్ రెడ్డి అన్నారు.సోమవారం ఆయన ఆలయాన్ని సందర్శించారు.స్థానికంగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నట్లు ఆయన గుర్తించారు.ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలను పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,ఆలయ భూములు రెండు ఎకరాల వరకు ఆక్రమణకు గురైందని నిర్మాణాల సైతం నిర్మిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమిని తిరిగి దేవాలయానికి కేటాయించాలని లేనియెడల ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరించారు. అవసరమైతే చుట్టుపక్కల పట్టాదారులతో చర్చిస్తామని వివరించారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఆదిత్య రెడ్డి, నార్సింగి మున్సిపాలిటీ ముఖ్య నాయకులు బిక్షపతి యాదవ్, రాజేష్, శివ రాజు, జైదీప్, బల్వంత్ రెడ్డి, అనిల్ రెడ్డి, శ్రీకాంత్, తలారి చిన్న,శంకర్ రెడ్డి, శివ లింగాయత్, దేవాలయ కమిటీ సభ్యులు, అధ్యక్షులు మహాగౌలి రామోజీ, ఉపాధ్యక్షులు సింధు కందకర్,జనరల్ సెక్రటరీ బాజీరావు,చంద్రకాంత్,సుభాష్ రాను, మంగప్ప,స్థానిక యువకులు, బస్తివాసులు తదితరులు పాల్గొన్నారు.
