Take a fresh look at your lifestyle.

గెట్‌ అవుట్‌ మై హోం … మనోజ్‌కు షాక్ ఇచ్చిన మోహన్ బాబు

 

  • తన ఆస్తుల నుంచి వెళ్లాలని కోర్టు నుంచి నోటీసులు
  • మంచు కుటుంబంలో చల్లారని చిచ్చు
  • ఇటీవలే తిరుపతిలో యూనివర్సిటీ దగ్గర లొల్లి
  • తాజాగా రండి తేల్చుకుందామంటూ మనోజ్‌ ట్వీట్‌
  • ఇదే సమయంలో మోహన్‌ బాబు నోటీసులు

ముద్ర, సినిమా ప్రతినిధి :- తన ఆస్తుల నుంచి మనోజ్ ను ఖాళీ చేయించాలని మోహన్ బాబు కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు. దీంతో ఖాళీ చేయాలని మనోజ్‌కు కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. మంచు మోహన్ బాబు కుటుంబంలో ఏర్పడిన వివాదం లో రోజుకో మలుపు చోటు చేసుకుంటోంది. తాజాగా మనోజ్‌కు మోహన్ బాబు షాక్ ఇచ్చారు. తన ఆస్తుల్లో ఉన్నవారిని ఖాళీ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్‌కి మోహన్ బాబు ఫిర్యాదు చేశారు.జల్‌పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని మోహన్ బాబు ఆరోపించారు. వాళ్లను ఖాళీ చేయించి ఆస్తులను తమకు అప్పగించాలని విజ్ఞప్తిచేశారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను తనకు వచ్చేలా చూడాలని మోహన్ బాబు మేజిస్ట్రేట్‌ను కోరారు. మేజిస్ట్రేట్ నుంచి వచ్చిన సూచనల మేరకు జల్‌పల్లిలో నివాసం ఉంటున్న మంచు మనోజ్ ఆస్తులపై పోలీసుల నుంచి నివేదిక తీసుకున్నారు కలెక్టర్. జల్‌పల్లి ఇంటిలో ఉంటున్న మనోజ్‌కు నోటీసులు జారీ చేశారు.

జల్ పల్లిలోని మంచు టౌన్ లో మోహన్ బాబు నివాసం ఉంది. అక్కడే మంచు మనోజ్ ఉంటున్నారు. ఇటీవల చెలరేగిన వివాదం కారణంగా మనోజ్ ను ఇంటి నుంచి పంపించేయాలని మోహన్ బాబు నిర్ణయించుకున్నారు. అయితే జర్నలిస్టుపై దాడి ఘటనలో ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లాల్సి రావడంతో.. ఆ ఇంట్లో మనోజ్ దంపతులు మాత్రమే ఉంటున్నారు. సుప్రీంకోర్టు నుంచి ఊరట పొందిన తర్వాత మోహన్ బాబు తిరుపతిలో ప్రత్యక్షమయ్యారు. అక్కడే ఎంబీయూ యూనివర్శిటీలో ఉన్న నివాసంలో ఉంటున్నారు. హైదరాబాద్‌లో మనోజ్ ఉంటున్నారు.

తిరుపతిలో ఉంటున్న మోహన్ బాబు – తాను వచ్చే సరికి మనోజ్ ఉండకూడదని పట్టుదల ఇటీవల మనోజ్ తిరుపతికి కూడా వెళ్లారు.ఎంబీయూ యూనివర్శిటీ దగ్గర వివాదం చెలరేగింది ఈ క్రమంలో ఇరు వర్గాలు పోలీసు కేసులు పెట్టుకున్నాయి. ఈ వివాదంతో అసలు మంచు మనోజ్ కు ఎలాంటి ఆస్తులు ఇవ్వడం కానీ..తన ఆస్తుల్లో ఉండే అవకాశం కానీ ఇవ్వకూడదనుకుంటున్న మోహన్ బాబు ఈ మేరుకు న్యాయపరమైన చర్యల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మోహన్ బాబు కలెక్టర్ ద్వారా ఇప్పించిన నోటీసులను మనోజ్ తీసుకున్నారు. ఆయన ఇంటిని ఖాళీ చేస్తారా లేక తాను కూడా.. న్యాయపరమైన అంశాలపై దృష్టి సారిస్తారా అన్నది తెలియాల్సిఉంది.

రండి.. తేల్చుకుందాం

మంచు ఫ్యామిలీ మధ్య ఘర్షణలు తగ్గుతున్నట్లే కనిపిస్తున్నా.. ఏదో ఓ రూపంలో మళ్లీ మొదటికి వస్తున్నాయి. వివాదాలకు పరిష్కారం వెతికేందుకు ఎవరికీ సాధ్యం కావడం లేదు. తాజాగా మనోజ్‌ చేసిన ట్వీట్ ఇంట్రస్ట్ పెంచుతోంది. దీంతో మంచు కుటుంబంలో వివాదాల ఎపిసోడ్‌ కొనసాగుతూనే ఉంది. ఇప్పటీకే కేసుల పరంపరం కొనసాగుతుండగా.. తాజాగా మనోజ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. చర్చలకు అన్న విష్ణును ఆహ్వానిస్తూ మనోజ్ ట్వీట్ చేశాడు. ‘రండి ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. నేను ఒక్కడినే వస్తాను. ఏ ప్లేస్‌కైనా వస్తాను.

ఎవరినో అడ్డం పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నాన్నని, మహిళ, సిబ్బందిని అడ్డం పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం లేదు. మన వద్ద ఉన్న సమస్యకు ఒక పరిష్కారం తీసుకొని వద్దాం. ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చలు జరుపుకుందాం.’ అంటూ మనోజ్ ట్వీట్ చేశారు. ఇక శుక్రవారం నాడు ఒక ట్వీట్ చేసిన మనోజ్.. అందులో షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణం రాజు మాదిరిగా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్’ అని పోస్ట్ చేసిన మనోజ్.. ఆ పోస్టుకు విష్ణును ట్యాగ్ చేశాడు.

యూనివర్సిటీ దగ్గర లొల్లి

మంచు కుటుంబంలో వివాదాలు ఒక దాని వెంట ఒకటి బయట పడుతూనే ఉన్నాయి. తాజాగా మంచు ఫ్యామిలీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మంచు మనోజ్‌ ఎంబీ యూనివర్సిటీ సందర్శనకు వెళ్లడంతో వివాదం మళ్లీ రాజుకుంది. మంచు ఫ్యామిలీలో గత నెలలో వివాదం చోటు చేసుకుంది. ఫ్యామిలీ గొడవలు పోలీస్‌ స్టేషన్‌ వరకు వచ్చాయి. పెద్ద రచ్చ రచ్చ అయ్యింది. కేసులు, కోర్ట్ ల వరకు వెళ్లింది. ఈ క్రమంలో సెటిల్‌ అయ్యిందని, గొడవ సర్దుమనిగిందని అనుకున్నారు. కానీ సడెన్‌గా ఇప్పుడు అగ్గిరాజేస్తుంది. వివాదం మళ్లీ స్టార్ట్ అయ్యింది. మంచు మనోజ్‌ సరికొత్త వివాదానికి తెరలేపాడు. ఆయన మోహన్‌బాబు యూనివర్సిటీని సందర్శించడం కోసం వెళ్లడంతో ఈ వివాదం మళ్లీ రాజుకుంది. మొదట రేణిగుంట వివామానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడి నుంచి ర్యాలీగా యూనివర్సిటీకి వెళ్లాడు. మంచు మనోజ్‌ని యూనివర్సిటీలోకి పోలీసులు అనుమతించలేదు.

ట్రస్ట్ వివాదం కేసు కోర్ట్ లో ఉన్న నేపథ్యంలో మంచు మనోజ్‌ కూడా అర్థం చేసుకున్నాడు. వెనుతిరిగాడు. అయితే తన తాతయ్య, నానమ్మ సమాధులను కూడా సందర్శించడానికి వీలు లేకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మనోజ్‌ లోపల ఉన్నవారిపై గట్టిగా అరిచాడు. పోలీస్‌ పై అధికారులతో మాట్లాడారు. మొత్తంగా పోలీసుల సపోర్ట్ తో మంచు మనోజ్‌ లోపలికి వెళ్లి తాత, నాన్న సమాధులను సందర్శించి దెండం పెట్టుకుని వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనని ఎందుకు అడ్డుకుంటున్నారనేది ప్రశ్నించారు మంచు మనోజ్‌. తనని చూసి ఎందుకు భయపడుతున్నారనేది ఆయన అడిగాడు. సమస్య ఏంటో అర్థం కావడం లేదన్నాడు. ఏదైనా ఉంటే చర్చించడానికి తాను సిద్ధమే అంటున్నాడు. ఆస్తి కోసం గొడవ కాదని స్పష్టం చేశాను, ఆస్తుల కోసం తాను గొడవ పడను అని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ప్రధానంగా కొన్ని విషయాలను లేవనెత్తాడు మంచు మనోజ్‌. యూనివర్సిటీ పరిధిలో, ట్రస్ట్ పరిధిలో కొంత అన్యాయం జరుగుతుందన్నారు. ప్రైవేట్‌ హాస్టల్స్ లో ఉన్న విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. హాస్టల్స్ ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని, ఇక్కడి స్థానిక ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నారని మనోజ్‌ ఆరోపించారు. దాన్ని ఆపమని ఆయన అడిగినట్టు తెలిపారు. ఇది అన్యాయమని, దీనిపై కూర్చొని మాట్లాడదామని చెప్పాడని, అయినా వినడం లేదని, ఇదే విషయంపై తాను ఫిర్యాదు చేశానని, మెసేజ్‌ చేశానని, ఈ విషయంలోనే గొడవ జరుగుతుందన్నారు.

తాను ఆరోపించడం వాళ్లకి నచ్చడం లేదని, అందుకే తనని ఇంట్లోకి కూడా రానివ్వడం లేదని తెలిపారు. అమ్మకి బ్రెయిన్‌ వాష్‌ చేసి దొంగ సంతకాలు పెట్టించారని ఆరోపించారు. అలాగే ఇంట్లో జెనరేటర్‌లో చెక్కర పోశారని, కరెంట్‌ తీయించే ప్రయత్నం చేశారని, అమ్మ నిలదీయడంతో అక్కడితో ఆగినట్టు చెప్పారు. ఈ గొడవలోకి తన భార్యని తీసుకురావడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మంచు మనోజ్‌. గొడవలోకి తన భార్యని ఎందుకు తీసుకొస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఆమెకి అమ్మానాన్న లేరు, తనుకు అన్నీ తానే అని, అండగా ఉంటానని, కానీ ఆమెని గొడవలోకి లాగడం తనకు నచ్చలేదని, ఆ విషయంలోనే తాను హర్ట్ అయినట్టు తెలిపారు. ఈ విషయంపై తాను పోరాడతానని, స్థానికులకు, ఫ్యాన్స్ కి అండగా ఉంటానని , విద్యార్థులకు అండగా ఉంటానని తెలిపారు. ఎవరూ భయపడవద్దన్నారు.

రియాక్షన్‌

అయితే ఇప్పుడు మనోజ్‌ ఎందుకు రియాక్ట్ కావాల్సి వచ్చిందనేది ఆసక్తికరంగా, సస్పెన్స్ గా మారింది. గొడవ సర్దుమనిగిందని అంతా భావించిన నేపథ్యంలో మంచు మనోజ్‌ సడెన్‌గా బయటకు రావడం, యూనివర్సిటీకి వెళ్లడం, తాతయ్య, నాన్నమ్మ సమాధులను సందర్శించుకోవాలనుకోవడం వెనుక ఆంతర్యమేంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవలే మంచు మోహన్‌ బాబు, మంచు విష్ణు ఫ్యామిలీతో కలిసి సంక్రాంతి సెలబ్రేట్‌ చేసుకున్నారు. వారంతా హ్యాపీగా గడిపారు. కానీ అక్కడ మనోజ్‌ లేరు. దీంతో వివాదం సమసిపోలేదని అర్థమయ్యింది. ఇప్పుడు మంచు మనోజ్‌ యూనివర్సిటీకి రావడంతో ఈ వివాదం మరోసారి హాట్‌ టాపిక్‌ అయ్యింది.

గతంలోనే మంచు మనోజ్‌.. యూనివర్సిటీలో, స్కూల్స్, కాలేజీలో అవకతవకలు జరుగుతున్నాయంటూ, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. సోషల్‌ మీడియా ద్వారా సీఎంలకు, డిప్యూటీ సీఎంలకు, సీఎస్‌లకు ఆయన సోషల్‌ మీడియా ద్వారా ట్యాగ్‌ చేస్తూ అవకతవకలకు సంబంధించిన అంశాలను పేర్కొంటూ లెటర్‌ రాశారు. దీంతో వివాదం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో మంచు మనోజ్‌కి, మోహన్‌బాబుకి గొడవ జరిగిందన్నారు. మనోజ్‌ని మోహన్‌బాబు కొట్టాడని, మనుషులతో కొట్టించాడనే ఆరోపణలు వచ్చాయి. మంచు మనోజ్‌ సైతం గాయాలతో ఆసుపత్రిలో చేరారు.

ఈ క్రమంలో వివాదం పెద్దది అయ్యింది. తనపైకొందరు దాడి చేశారని మనోజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో తనకు ప్రాణహానీ ఉందంటూ మోహన్‌బాబు సైబరాబాద్‌ కమిషనర్‌కి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో మనోజ్‌ని హైదరాబాద్‌లోని ఇంటికి మోహన్‌బాబు అనుమతించలేదు. ఖాళీ చేయాలని డిమాండ్‌ చేశాడు. అలాగే ఓ వాయిస్‌ మెసేజ్‌ కూడా విడుదల చేశారు. మనోజ్‌ తాగుతూ వస్తున్నాడని, తప్పు మీద తప్పు చేస్తున్నాడని, ఇక సహించేది లేదని తెలిపారు. అందుకే నా ఇంట్లో ఉండటానికి వీళ్లేదన్నారు. మనోజ్‌ రాకుండా గేటుకి లాక్‌ చేశాడు. దాన్ని పగలగొట్టకుని లోపలికి వెళ్లాడు మనోజ్‌. ఈ క్రమంలో ఆగ్రహానికి గురయిన మోహన్‌బాబు బయటకు వస్తూ మీడియాపై దాడి కూడా చేశారు. దీంతో ఇది పెద్ద సంచలనంగా మారింది. మంచు ఫ్యామిలీ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్ అయ్యింది. అనంతర పరిణామాలతో సైలెంట్‌ అయ్యారు. ఇలా సైలైట్‌ కావడంతో గొడవ సెటిల్‌ అయ్యిందని భావించారు. కానీ ఇప్పుడు మనోజ్‌ యూనివర్సిటీ ఎంట్రీతో మరోసారి రచ్చ రచ్చ లయింది. ఇదే సమయంలో మనోజ్‌ చేసిన ట్వీట్‌.. మళ్లీ ఆసక్తి పెంచుతుంది.

మరోవైపు మోహన్ బాబు చిన్నకుమారుడు అయిన మంచు మనోజ్, మోహన్ బాబుకు సరిపడటం లేదు. ఆయన నుంచి ప్రాణహాని ఉందని మోహన్ బాబు కూడా ఫిర్యాదు చేశారు. అయితే అది కుటుంబ గొడవ కావడంతో పోలీసులు పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. వారు బౌన్సర్లను పెట్టుకుని గందరగోళం చేస్తూండటంతో రాచకొండ కమిషనర్ పిలిచి వార్నింగ్ ఇచ్చారు. బౌన్సర్లతో శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే ఊరుకునేది లేదన్నారు.

Leave A Reply

Your email address will not be published.