Take a fresh look at your lifestyle.

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు…

 
-10వ తరగతి పరీక్షలో మొదటి బహుమతి 5016,  రెండవ బహుమతి 3016.

మోత్కూర్ ముద్ర న్యూస్: మండలం లోని పాటిమట్ల గ్రామంలో చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా పాటిమట్ల శివాజీ యూత్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ఎగ్జామ్ స్టేషనరీ ఇవ్వడం జరిగింది.పదవ తరగతిలో పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థికి రూపాయలు(5016)నగదు బహుమతి, రెండవ బహుమతి (3016) రూపాయలు నగదు బహుమతి అందజేస్తామని చత్రపతి శివాజీ యూత్ సభ్యులు ప్రకటించారు. ఈ కార్య క్రమంలో శివాజీ యూత్ అధ్యక్షులు గణగాని రాజేష్, ఉపాధ్యక్షులు రాచకొండ కరుణసాగర్, ప్రధాన కార్యదర్శి షేక్ సలీం, కోశాధికారి రేగటి రాకేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు దామోదర్, లింగమల్లు, మల్లయ్య, యాదయ్య, చిరుమర్తి యాదయ్య, కవిత, తిరుపతి, కృష్ణవేణి. శివాజీ యూత్ సభ్యులు దొండ మధు, చల్ల సన్నీ, చల్ల ప్రవీణ్, చెల్లగొల్ల గణేష్, మారుపాక పవన్, యేళ్లు సాయి, రాచకొండ సునీల్, చల్ల వంశీ,నందు, చల్ల నవీన్,మర్రి పరమేష్, సుభాష్, నవీన్, మహేష్, మనోజ్, రాకేష్, మర్రి మనోజ్,చెల్లగొల్ల మధు, కోటమర్తి మధు, ఎల్లంల ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

హిందూ వాహిని ఆధ్వర్యంలో భారీ ర్యాలీ పాల్గొన్న ఎమ్మెల్యే, ఛైర్పర్సన్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి పురస్కరించుకొని గురువారం హిందూ వాహిని జిల్లా, పట్టణ శాఖ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్ర స్థానిక హనుమాన్ వాడ నుండి ప్రారంభమై భువనగిరి పుర వీధుల్లో తిరుగుతూ నల్లగొండ చౌరస్తా శివాజీ విగ్రహం వరకు సాగింది. ఈ శోభాయాత్రకు ముఖ్య వక్త గా హిందూ వాహిని తెలంగాణ ప్రాంత కమిటీ సభ్యులు హయత్నగర్ శ్రీనివాస్, ముఖ్య అతిథిగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో హిందూ వాహిని జిల్లా అధ్యక్షులు కడారి శివ యాదవ్, పట్టణ అధ్యక్షులు ఉదరి రాంరాజ్, బెల్లంకొండ చందు, రామగోని భాను, కందారి శ్రీధర్, పంచేదుల్ల భరత్, రావుల మహేష్, ఉడుతల భరత్, పవన్, ప్రణీత్, సాయి గణేష్, వివిధ క్షేత్ర కార్యకర్తలు, వివిధ పార్టీల నాయకులు, యువజన సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.