Take a fresh look at your lifestyle.

పేదలకు స్వచ్ఛంద సంస్థలు చేయూతనివ్వాలి

 

ముద్ర : కాప్రా

సమాజంలోని నిరుపేద ప్రజలకు స్వచ్ఛంద సంస్థలు చేయూతనివ్వాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు.నిరుపేదలు, భక్తులకు నిరంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవా భావాన్ని చాటుతున్న ఈసీఐఎల్ లోని సోలిస్ ఐ కేర్ సిఎండి, తులసమ్మ చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్ నందనంపాటి రాము నిజమైన సేవా స్ఫూర్తి ప్రదాత అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలచారి అభినందించారు. సోమవారం ఈసీఐఎల్‌లోని సోలిస్ ఐ కేర్ హాస్పిటల్‌లో “అన్నదాన సేవా చక్రవర్తి” అవార్డు అందుకున్న నందనంపాటి రాము అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నందనంపాటి రాము సమాజంలో సేవా కార్యక్రమాలకు ముందుండి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఇందులో భాగంగా పాండిచ్చేరిలోని తిరునల్లార్‌ లోని ప్రసిద్ధ ధర్బరణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 6, 7, 8 తేదీలలో జరిగిన శని పేర్చి పవిత్ర ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా తులసమ్మ చారిటబుల్ ఫౌండేషన్, సోలిస్ హాస్పిటల్ చైర్మన్ నందనపాటి రాము ఆధ్వర్యంలో సుమారు రెండు లక్షల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఐదవ సారి ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ 27వ పీఠాధిపతి మహా సన్నిధానం శ్రీ లా శ్రీ కైలై మాసిలామణి దేశిక జ్ఞాన సంబంధ పరమాచార్య స్వామిగళ్ చేతుల మీదుగా నందనంపాటి రాముకు “అన్నదాన సేవా చక్రవర్తి” అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పేదలు, అవసరమైన వారికి అన్నప్రసాద వితరణ చేయడం ద్వారా ఆయన మానవతా విలువలను చాటుతున్నారని పేర్కొన్నారు. సమాజ సేవలో ఆయన చేస్తున్న కృషికి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువేనని వారు అన్నారు. అలాగే భక్తి భావంతో, సమాజం పట్ల బాధ్యతతో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాప్రా మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, సోలీస్ ఐ కేర్ సిబ్బంది విజయేందర్ రెడ్డి, మహేష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.