Take a fresh look at your lifestyle.

కలెక్టర్ తో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ భేటీ

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అంకం మౌనిక శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు కలెక్టర్‌కు పూలమొక్కను అందజేసి, శాలువాతో సన్మానించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా చైర్‌పర్సన్ సమర్థవంతంగా పని చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బొప్పారపు సత్యవతి, గుమ్ముల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.