Take a fresh look at your lifestyle.

గ్రామపంచాయతీలకు రూ.387 కోట్లు రిలీజ్

15వ ఆర్ధిక సంఘ: నిధులు విడుదల చేసిన కేంద్రం
పెండింగ్లో ఉన్న పనులకు, మౌలిక సదుపాయాల కల్పనకు ఊతం

ముద్ర, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ గ్రామపంచాయతీలకు కేంద్రం శుభవార్త అందించింది. వారం రోజుల క్రితం 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలలో భాగంగా తొలివిడతలో రూ.259.36 కోట్లు రిలీజ్ చేసిన కేంద్ర ప్రభుత్వం గురువారం మరో రూ.387 కోట్ల నిధులు విడుదల చేసింది. గ్రామపంచాయతీ ఎన్నికలు ఆలస్యం కావడంతో.. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల కూడా ఆలస్యమైంది. రెండు విడతల్లో కలిపి మొత్తం రూ.646.46 కోట్లను రిలీజ్ చేసింది. ఈ నిధులతో గ్రామ పంచాయతీల్లో పెండింగ్లో ఉన్న పనులకు, మౌలిక సదుపాయాల కల్పనకు ఊతం లభించనుంది. ఇంకా రూ.2400 కోట్ల నిధులు కేంద్రం నుంచి గ్రామపంచాయతీలకు రావలసి ఉంది. కాగా గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడకుండా ఉండాలంటే కేంద్రం పెండింగ్ లో ఉన్న నిధులను యుద్ధప్రాతిపదికన విడుదల చేయాలని రాష్ట్ర పంచాయతీశాఖ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. కేంద్రం చెప్పిన నిబంధనలన్నీ రాష్ట్ర ప్రభుత్వం పాటించిందని, సకాలంలో ఫండ్స్ అందితేనే గ్రామాల రూపురేఖలు అభివృద్ధితో మారుతాయన్నారు.

Leave A Reply

Your email address will not be published.