ఏపీలోనే దోస్తానా
తెలంగాణలో బీజేపీ సొంతంగా ఎదిగేంత శక్తి కలిగి ఉంది
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్
ముద్ర, నిజామాబాద్ :
బీజేపీకి జనసేనతో దోస్తానా కేవలం ఏపీలోనే ఉందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు. ఆ రాష్ట్రంలో బీజేపీతో పొత్తు కలిగి ఉన్న జనసేనతో తెలంగాణ బీజేపీకి సంబంధం లేదని తేల్చి చెప్పారు. బీజేపీకి ఏ పార్టీ, ఏ వ్యక్తి మద్దతు అవసరం లేదని వివరణ ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ సొంతంగా ఎదిగేంత శక్తి కలిగి ఉందని వెల్లడించారు. బుధవారం నిజామాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికీ రాష్ట్రానికీ మధ్య పొత్తుల విషయంలో తేడాలు ఉంటాయని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ రాజకీయాలు వేరుగా ఉంటాయని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించాయని.. ఆ తర్వాత కూడా ఆ రాష్ట్రంలో పొత్తు కొనసాగుతోందని వెల్లడించారు. అయితే తెలంగాణలో మాత్రం అలాంటి పరిస్థితి లేదని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ పార్టీ చాలా బలంగా ఉందని.. ఇక్కడ ఇతర పార్టీల మద్దతు తమకు అవసరం లేదని ధర్మపురి అర్వింద్ తేల్చి చెప్పారు.