- అడ్డుగా వచ్చిన వదినపై దాడి
- గొడవకు ఆస్తి తగాదాలే కారణం
కోరుట్ల/కథలాపూర్, ముద్ర: ఆస్తి తగాదాల విషయం లో జరిగిన గొడవ లో అన్న పై తమ్ముడు గొడ్డలితో దాడి చేసిన ఘటన కథలాపూర్ మండలం లో చోటు చేసుకొంది. స్థానికుల సమాచారం ప్రకారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఇప్పపెళ్లి గ్రామానికి చెందిన యాగండ్ల పెద్దరాజం 59, చిన్న రాజం 54, అన్న తమ్ములు తన తండ్రి వారసత్వమైన ఆస్తి విషయం లో జరిగిన గొడవలో అన్న పై తమ్ముడు గొడ్డలితో దాడి చేశాడు.ఈ క్రమంలో అడ్డుగా వదిన లక్ష్మి 53 రావడంతో ఆమె పై కూడా చిన్న రాజం దాడి చేశాడు.ఈ ఘటనలో వదినకు రెండు చోట్ల గాయాలు కాగా హుటా హుటీన కోరుట్ల లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.దాడికి పాల్పడ్డ వ్యక్తిని పోలిసులు అదుపులోకి తీసుకున్నారు.బాధితురాలి భర్త పెద్ద రాజం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.