Take a fresh look at your lifestyle.

హార్వర్డ్ వేదికపై తెలంగాణ రైజింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

 

ముద్ర, తెలంగాణ బ్యూరో :

దేశభవిష్యత్తుకు తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా హైదరాబాద్ నగరంఆదర్శంగా నిలుస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. భారతదేశంతో అనుసంధానం పెంచుకొని పనిచేయాలని అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ పూర్వ, ప్రస్తుత విద్యార్ధినీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. తమ ప్రతిభ, నైపుణ్యం, సంకల్పంతో తెలంగాణ రైజింగ్ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాని సూచించారు. సీఎం పిలుపుపై సానుకూలంగా స్పందించిన విద్యార్థులు తెలంగాణ అభివృద్ధి పథంలో తమ నైపుణ్యాన్ని, శక్తిసామర్థ్యాన్ని వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర గ్లోబల్ ప్రతిష్ఠను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు వివరించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ లో లీడర్ షిప్ కోర్సు పూర్తి చేశారు. గత నెల 25 నుంచి 30 వరకు ‘లీడర్‌షిప్‌ ఫర్‌ ది ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ’ పేరిట నిర్వహించిన తరగతులకు హాజరైన ఆయన…. తన అధికారిక కార్యక్రమాల చివరి రోజు సందర్భంగా శనివారం యూనివర్సిటీలో వివిధ ప్రతినిధి బృందాలతో భేటీ అయ్యారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు, పూర్వ విద్యార్థులతో పాటు, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కొలంబియా విశ్వవిద్యాలయం వంటి ప్రముఖ విద్యాసంస్థల విద్యార్థులు, అలుమ్నీలతోనూ సీఎం సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఈ సమావేశాల్లో నాయకత్వం, విజయానికి సంబంధించిన అంశాలు, ఆర్థిక వృద్ధి, అభివృద్ధి నమూనాలు, సుస్థిరత, పర్యావరణ సవాళ్లు, రైతులు–మహిళలు–యువతకు సంక్షేమ విధానాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రాష్ట్రం ఎదుర్కొంటోన్నసవాళ్లతో పాటు తన దీర్ఘకాలిక విజన్ తెలంగాణరైజింగ్ కోర్ పిల్లర్లను వారికి వివరించారు.

సమగ్ర వృద్ధి, భాగస్వామ్య భాగస్వామ్యం (స్టేక్‌హోల్డర్ పార్టిసిపేషన్), శక్తివంతీకరణ ఆధారిత అభివృద్ధికి ఈ విజన్ కల్పించే అవకాశాలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఒక విద్యార్థుల బృందం తమకు నాయకత్వం గురించి బోధించాలని కోరగా అందుకు హార్వర్డ్ ప్రొఫెసర్లే ఉత్తములు అని ఈ విషయంలో తాను మోసపూరిత ప్రొఫెసర్ పాత్రను ధరించదలుచుకోలేదని సీఎం రేవంత్ సరదాగా వ్యాఖ్యానించారు. పరస్పర సంభాషణ, అనుభవాల పంచుకోవడం, పరస్పర అధ్యయనం ఆధారంగా జరిగే సార్థక ద్విముఖ చర్చలకే తాను ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.