Take a fresh look at your lifestyle.

సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలి

  • టాస్క్ సి ఓ ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి.

ముద్ర ప్రతినిధి కల్వకుర్తి : ఆపదలో ఉన్నవారికి ఆర్థిక తోడ్పాటు అనిపించేందుకు అందజేస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధిని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని టాస్క్ సి ఓ ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలోని వెల్దండ, ఆమనగల్, కల్వకుర్తి, తలకొండపల్లి, కడ్తల్ మండలాలకు చెందిన 22 మంది లబ్ధిదారులకు రూ.6,66,500/- విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను వెల్దండ లో పంపిణీ పంపిణీ చేసి మాట్లాడారు.అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి చికిత్స కోసం అందిస్తున్న సహాయనిది ఎంతో తోడ్పాటు అందిస్తుందని అన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు పంతుల నాయక్, నరేందర్ గౌడ్,సీనియర్ నాయకులు వెంకట్ నాయక్, శ్రీను నాయక్,కొండల్ యాదవ్, లక్ష్మణ్, తరుణ్ స్వామి, కృష్ణ యాదవ్ లతో పాటు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.