- ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
ముద్ర,వీపనగండ్ల : విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించి స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.వీపనగండ్ల జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది.ఈ సందర్భంగా 30 మంది విద్యార్థిని విద్యార్థులు వివిధ సబ్జెక్టులకు ఉపాధ్యాయులుగా,జిల్లా కలెక్టర్, డీఈఓ,ఎంఈఓ గా విధులను నిర్వహించార ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులు తోటి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలను బోధించారు.ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని,తోటి విద్యార్థులకు తరగతులలో ఉపాధ్యాయులుగా పాఠాలు చెప్పటం మరిచిపోలేనిదిగా ఉంటుందని ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులు అన్నారు.పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయడానికి జిల్లా కలెక్టర్,డీఈఓ గా విద్యార్థులు వారి వేషాధారణలో రావడం జరిగింది.జిల్లా కలెక్టర్గా హర్షవర్ధన్,డీఈఓ గా అశోక్,పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా మనోజ్,ఎంఈఓ గా హర్ష విధులను సమర్థవంతంగా నిర్వహించారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాను ప్రకాష్,ఉపాధ్యాయులు మహిపాల్ రెడ్డి, మహేష్, శ్రీనివాస్, ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
