Take a fresh look at your lifestyle.

మాటల మారాఠీ రేవంత్ పూటకో మాట మారుస్తూ సీఎం పబ్బం-సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి ఆగ్రహం

ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకుండా స్కూటీలా..?
పేదలు, దళిత, గిరిజనులకు లేకుండా జర్నలిస్టులకు భూములా..?
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి ఆగ్రహం

ముద్ర, తెలంగాణ బ్యూరో :

పూటకో మాటతో పబ్బం గడుపుతోన్న సీఎం రేవంత్ రెడ్డి మాటల మరాఠీగా అవతారమెత్తారని కేంద్ర హెం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ప్రసంగించిన సీఎం.. త్వరలోనే కాలేజీ విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు అందించబోతున్నామంటూ చేసిన ప్రకటనపై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి పూటకో మాట మారుస్తున్నారని సోమవారం ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. కాలేజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయన్న ఆయన సీఎం మాత్రం ఉచిత ఈవీ స్కూటర్లు ఇస్తామని హామీ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. పేదలు, దళిత, గిరిజనులకు ఇచ్చేందుకు భూములు లేవని చెబుతున్న రేవంత్ రెడ్డి జర్నలిస్టులకు, మూసీ బాధితులకు భూములు ఇస్తామని ఎలా చెప్పగలుగుతున్నారని ప్రశ్నించారు. పెన్షన్లు చెల్లించడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని చెబుతూనే ఓవైసీ ఒక్క పిలుపునిస్తే మూసీ ప్రాజెక్టు కోసం రూ. వేల కోట్లు ఏర్పాటు చేస్తున్నారని దుయ్యబట్టారు.

Leave A Reply

Your email address will not be published.