Take a fresh look at your lifestyle.

ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

 

ముద్ర, కోరుట్ల;
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామానికి చెందిన మాడవేణి నవీన్ 25 అనే యువకుడు గత కొన్ని సంవత్సరాల నుండి మానసిక పరిస్థితి బాగాలేక గతంలో పలుమార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేయగా కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స చేయించారు. అదే క్రమంలో ఆదివారం రోజు అర్ధరాత్రి తన ఇంటిలో ఉన్న ఫ్యాన్ కి చీరతో ఉరివేసుకొని చనిపోయినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. మృతిని తండ్రి అయిన మాడవేని నగేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కథలాపూర్ ఎస్సై తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.