Take a fresh look at your lifestyle.

vikarabad : బిఆర్ఎస్, బిజెపి సీక్రెట్ దోస్తులు-వికారాబాద్ లో మీడియాతో మంత్రి శ్రీధర్ బాబు

బిఆర్ఎస్, బిజెపి సీక్రెట్ దోస్తులు
-వికారాబాద్ ను టూరిజం కేంద్రంగా చేస్తాం
వికారాబాద్ అభివృద్ధికి రూ. వందల కోట్లు
-తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలలో చైర్మన్ లను కైవసం చేసుకుంటాం
-వికారాబాద్ లో మీడియాతో మంత్రి శ్రీధర్ బాబు
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి: టిఆర్ఎస్ బిజెపి పార్టీలు చీకటి దోస్తాను చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీపై విడుదల జల్లి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు వికారాబాద్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ
సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీకు గెలిపిస్తాయన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామన్నారు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ ప్రయాణం ఇస్తున్నామన్నారు.
యువతకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ టిఆర్ఎస్ నాయకులు బొంతు రామ్మోహన్ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సత్యనారాయణ మున్సిపల్పూర్ లీడర్ సుధాకర్ రెడ్డి చైర్మన్ అభ్యర్థి అనన్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.