ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి :
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దివంగత ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ గారి సతీమణి విమల ను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప గారిని మంత్రి ఆదేశించారు.
