ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్,రాయికల్ మండలంలో మైతపూర్ లోని 2 కేంద్రంలో శుక్రవారం ఐసిడిఎస్ అధికారుల ఆధ్వర్యంలో పోషణ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం, సీమాంతాలు నిర్వహించారు.అనంతరం ఐసీడిఎస్ సూపర్ వైజర్లు కవితా రాణి, పద్మావతి లు మాట్లాడుతూ తినే ఆహార పదార్థాలలోరోజుకు ఒక పూట చిరుధాన్యాలు ఉండేలా చూసుకోవాలన్నారు.పిల్లలు మొదటి వెయ్యి రోజుల ప్రాముఖ్యత గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తల్లులకు అవగాహనా కల్పించారు.పిల్లలకు ఆరు నెలల వరకు తల్లిపాలు పట్టించాలని, పిల్లల పెరుగుదల, పర్యవేక్షణ గురించి తల్లులకు కవిత రాణి, పద్మావతి లు అవగాహనా కల్పించారు.ఆహార పదార్థలు, చిరు దాన్యాలు ఉపయోగించి వంటకాలను తయారు చేయడం పై ప్రదర్శన ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ఇల్లందుల శ్రీనివాస్, ఏఎన్ఎం మాదేశి శిరీష, హేమలత,గ్రామ కార్యదర్శి తొగిటి వేణు,గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు, అంగన్వాడీ టీచర్స్ అరుణ, జయమాల, మమత,శాంత,స్రవంతి,ఆశ వర్కర్లు మంజుల,గంగనర్సు,మమత, తులసి,శంకరమ్మలు పాల్గొన్నారు.