మంథని ముద్ర విలేఖరి :మంథని మండల పరిధిలోని సూరయ్యపల్లి గ్రామం ముదిరాజ్ కులస్తులు ఇటీవల రాష్ట్ర ఐటీ పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు దృష్టికి కమ్యూనిటీ హాల్ వద్ద నీటి సమస్యను తెలిపారు. వారు స్పందించి బోర్ సాంక్షన్ చేయడం చేయించారు. శనివారం ముదిరాజ్ కులస్తుల కమ్యూనిటీ హాల్ వద్దకు బోర్ బండి రావడం వలన,నాయకులు గ్రామస్తులు కొబ్బరికాయ కొట్టి బోరు వేపించారు .గ్రామస్తులు మాట్లాడుతూ మా యొక్క సమస్యను తెలిపిన వెంటనే అర్థం చేసుకుని బోర్ సాంక్షన్ చేపించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్న మంత్రి శ్రీధర్ బాబుర కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.రానున్న రోజుల్లో మన గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని కాంగ్రెస్ పార్టీ జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జి ఆరేళ్ళి కిరణ్ గౌడ్,మాజీ సర్పంచ్ మంథని కర్ణ కృష్ణ అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల కిరణ్,గ్రామ శాఖ అధ్యక్షులు రేపాక శ్రీనివాస్, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు జంజర్ల మల్లేష్, యూత్ అధ్యక్షులు చంద్రు విజయ్, నాయకులు జింజర్ల గట్టయ్య, తాటి కంటి రమక్క, జంజర్ల దుర్గరాజు, చెరుకు తోట రమేష్, మాజీ వార్డు సభ్యులు ఎరుకల సురేష్, ముదిరాజ్ కులస్తులు బీరక సదానందం, దేవేందర్, బొల్లి ప్రసాద్, హరీష్, జోడు రాజు, రెడ్డి రాజన్న, సుంకరి దేవేందర్, వెంకన్న, పులి సదానందం, నీర్లా ఉపేందర్, సాగర్ మరియు మహిళా సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
