- అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు అండగా ఉంటామని హామీ ఇచ్చిన ఫౌండర్ మానస గౌడ్
ముద్ర,పానుగల్ :- బోర్డ్ ఆఫ్ డిజేబుల్డ్ క్రికెట్ అస్సోసియేషన్ ఆఫ్ ఇండియా తరపున ఫిబ్రవరి 14 నుండి18 వ తేదీ వరకు నేపాల్ లో జరగబోయే 3 T20 & 2 ODI మ్యాచ్లకు టీంఇండియా తరపున సెలెక్ట్ అయిన వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల కేంద్రానికి చెందిన కే.బి ప్రభాకర్ ను SHINE A LIFE NGO ఫౌండర్,చింతకుంట గ్రామానికి చెందిన మాజీ సింగిల్ విండో చైర్మన్ కుమార్ గౌడ్ కూతురు శ్రీమతి బాదగౌని మానస గౌడ్ క్రికెటర్ ప్రభాకర్ ను అభినందించి,తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ఎదుగుదలకు ఆర్థికంగా అండగా ఉంటానని హామీ ఇవ్వటం జరిగింది.వార్త పత్రికల ప్రకటన ఆధారంగా,తాడిపర్తి & గోపాలపేట గ్రామాల యువకులు ప్రభాకర్ ఆర్థిక పరిస్థితిని మానస గౌడ్ దృష్టికి తీసుకురావటంతో ఈ సందర్బంగా 50,000/- నగదు బహుమతి మరియు 25,000/- విలువ గల ప్రొఫెషనల్ (క్రికెట్ కిట్) ను ప్రభాకర్ కు అందించి భవిష్యత్తుల్లో ఉన్నత స్థాయికి చేరుకోని మన జిల్లాకు, రాష్ట్రానికి & దేశానికి మంచి పేరు తేవటం లో కీలక పాత్ర పోషించాలని ఆమే ఆకాంక్షించారు.