ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఫుల్వామా లో 2019 సంవత్సరంలో ఫిబ్రవరి 14న అమరులైన జవాన్లకు నివాళులు అర్పించారు. స్థానిక జె వి ఎన్ ఆర్ పాఠశాలలో చిన్నారులు మృత వీరుల స్మృతి సూచకంగా కొవ్వొత్తులు వెలిగించి వారి త్యాగాలను స్మరించుకున్నారు.అంతకు ముందు వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మౌనం పాటించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మణి కుమారి, సిబ్బంది పాల్గొన్నారు.