Take a fresh look at your lifestyle.

జోగిపేటలో సీతారాముల కళ్యాణోత్సవాల్లో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్

ముద్ర ప్రతినిధి సంగారెడ్డి:

జోగిపేట :

శ్రీ రామ నవమి సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఆందోల్ జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని జోగిపేట జరిగిన శ్రీ సిత రామ కళ్యాణ మహోత్సవం లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలోఅందోల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు క్రాంతి కిరణ్ శ్రీ వీర హనుమాన్ దేవాలయం , శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయం వద్ద శ్రీ రామాలయం లో జరిగిన శ్రీ సీతా రాముల కళ్యాణం మహోత్సవ కార్యక్రమం లో పాల్గొని హనుమాన్ దేవాలయం మరియు శ్రీ సీత రామ ఆలయంలో స్వామి వార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరము ఆన్న ప్రసాద వితరణ కార్యక్రమం లో పాల్గొని సహా పంక్తి భోజనం చెసారు. ఈ కార్యక్రమంలో
అందోల్ జోగిపేట మున్సిపల్ కౌన్సిలర్ పట్లురి శివ శేఖర్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లిఖార్జున్ గుప్త , బి ఆర్ ఎస్ నాయకులు చాపల వెంకటేశం బిర్ల శంకర్, మహేష్ యాదవ్, నాయికొటి అశోక్, ఉస నాగ రాజు, అకుల శంకర్, యెర్ర సాయిలు, గాజుల రవి, శంకర్ రావు, ప్రదీప్ గౌడ్ మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.