Take a fresh look at your lifestyle.

పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు ఎస్పీ జి.జానకి షర్మిల

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
శనివారం నుండి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డా. జి. జానకి షర్మిల తెలిపారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు జిల్లాలోని మొత్తం 47 పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో బి ఎన్ ఎస్ సెక్షన్ 163 (పూర్వపు 144 సెక్షన్) అమలులో ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించామన్నారు. చీటీలు పంపించడం, ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి సామాజిక వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు కూడా పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకుని ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రశ్నాపత్రాల రవాణా, పరీక్ష అనంతరం సమాధాన పత్రాల భద్రత కోసం ప్రత్యేక పోలీసు ఎస్కార్ట్ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.పరీక్షల ప్రారంభం నుండి ముగింపు వరకు నిరంతర పోలీసు పెట్రోలింగ్ నిర్వహించ బడుతుందని తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.