మల్యాల,ముద్ర విలేకరి: మండలంలోని ఎన్ఎస్వి ఆల్ఫోర్స్ పాఠశాలలో ఆషాడ మాసం బోనాల పండుగ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి తండ్రి మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ రీతిలో దుస్తులు ధరించి, బోనాలు ఎత్తుకొని ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు విద్యార్థుల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చాలా విశిష్టత ఉన్నదని అన్నారు. ఆషాడ మాసంలో జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ అని అన్నారు. మతాలకు అతీతంగా బోనాల పండుగ ఉత్సవాలు వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని అదే సంప్రదాయాన్ని నేటి తరం కొనసాగించడం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకతని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు ఉజ్వల్ తదితరులు పాల్గొన్నారు.
