Take a fresh look at your lifestyle.

తెలంగాణకు ఫస్ట్ అండ్ లాస్ట్ విలన్ కేసీఆరే!

  • రాష్ట్రంలో ఆయన శకం ముగిసింది.
  • కేటీఆర్, హరీష్ రావు, కవితల మూడు ముక్క లాటతో కేసీఆర్ కు మతిభ్రమించింది.
  • కుటుంబ కొట్లాట వేగలేక రజతోత్సవ సభ పేరిట హంగామా చేశారు.
  • 15 నెలల కాంగ్రెస్​ పాలనపై చర్చకు సిద్ధం.
  • బీఆర్ఎస్ రజతోత్సవ సభ అట్టర్​ ఫ్లాప్​.
  • మీడియాతో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణకు ఫస్ట్ అండ్ లాస్ట్ విలన్ కేసీఆరేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు.తెలంగాణలో కేసీఆర్ శకం ముగిసిందని కీలక వ్యాఖ్యలు చేశారు.సోమవారం గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.కేటీఆర్, హరీష్ రావు, కవిత ఆడుతున్న మూడు ముక్క లాటతో కేసీఆర్ కు మతి భ్రమించిందని సెటైర్లు వేశారు.కుటుంబ కొట్లాట వేగలేకే రజతోత్సవ సభ పేరిట కేసీఆర్ హంగామా సృష్టించారని చురకలంటించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.వేదికపై అయ్య కేసిఆర్, కొడుకు కేటీఆర్ ఫ్లెక్సీ తో అల్లుడు హరీష్, కూతురు కవిత మనసుకి మరోసారి గాయమైందన్నారు.ఈ నెల 27 వరంగల్ లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో జనాల కంటే విస్కీలు ఎక్కువ ఉన్నాయని అసలు ఆ సభలో అసలు మహిళలే కనిపించలేదని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. వరంగల్ సభ లో కేసీఆర్ ప్రసంగంలో పసలేదని చురకలంటించారు.కాంగ్రెస్ బిక్షతోనే కేసీఆర్ సీఎం అయ్యారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని చూసి కేసీఆర్ కి గుండెల్లో గుబులు మొదలైందన్నారు.420 హామీలంటూ విమర్శిస్తున్న కేసీఆర్ మీ పదేళ్ల బిఆర్ఎస్ పాలన 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు. సమయం, వేదిక మీరే డిసైడ్ చేయండి చర్చకు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని మహేశ్ కుమార్ గౌడ్ ఛాలెంజ్ చేశారు.అసలు ఫాం హౌస్ దాటి వచ్చే దమ్ము కేసీఆర్ కు ఉందా అని ప్రశ్నించారు.బీఆర్ఎస్ హయంలో కేసీఆర్ కుటుంబం రైజింగ్ అయిందని ఆరోపించారు.జన్వాడలో ఉన్న ఫాం హౌస్ లు ఎవరివని ప్రశ్నించారు. కేసీఆర్ అరాచక పాలనను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు.దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని నకిలీ గాంధీలు అనడం కేసిఆర్ దుస్సాహసానికి పరాకాష్ట అన్నారు. దీనికి కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. గాంధీ కుటుంబం పెట్టిన రాజకీయ భిక్షతో దొంగ పాస్ పోర్టుల బిజినెస్ చేసుకునే కేసీఆర్​ కుటుంబం రూ. లక్షల కోట్లకు పడగలెత్తిందని ఆరోపించారు.పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో కేసిఆర్ కుటుంబం దోపిడీకి కేరాఫ్ అడ్రస్ గా మారింది.దేశ చరిత్రలో అతి తక్కువ కాలంలో ఎక్కువ దోచుకున్న కుటుంబం కేసీఆర్ కుటుంబం అన్నారు.గత ప్రభుత్వ హయంలో తెలంగాణ అన్ని రంగాల్లో విధ్వంసం జరిగిందన్నారు.పార్టీ పేరులోంచి తెలంగాణ పదాన్ని తొలగించిన కేసీఆర్ కు ఇప్పుడు జన్మభూమిని గుర్తుకు వచ్చిందా అని సెటైర్ వేశారు.తెలంగాణ సెంటి మెంటును వాడుకోవడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు.బీజేపీ-బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అనడానికి నిదర్శనం బీజేపీపై కేసీఆర్ రెండు నిమిషాల ప్రసంగం అని ఎద్దేవా చేశారు.బీజేపీపై కేసీఆర్ విమర్శలు నెమలి పించ్చంతో కొట్టినట్లు ఉందన్నారు.కేసీఆర్ ప్రసంగంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని మరోసారి రుజువైందన్నారు. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ, వక్ఫ్ చట్టంపై కేసీఆర్ ఎందుకు నోరు మెదపలేదన్నారు. బీజేపి, బీఆర్ఎస్ కుట్రపన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పై విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.