Take a fresh look at your lifestyle.

ప్రజావాణి ఫిర్యాదు లకు తక్షణ చర్యలు తీసుకోవాలి : స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ పాండు

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి
ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే ప్రజావాణి కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అదనపు కలెక్టర్ పాండు అన్నారు.
సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పాండు, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి కలిసి ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.భూమి సమస్యలు,పింఛన్లు,సంక్షేమ పథకాలకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రజలు అర్జీలు సమర్పించారు.
ఈసందర్భంగా అదనపు కలెక్టర్‌ పాండు మాట్లాడుతూ ప్రజల నుండి ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే అర్జీలు , పిర్యాదులు,వినతులను ఆలస్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 57 అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు.అందిన ప్రతి వినతిని నమోదు చేసి సంబంధిత శాఖలకు పంపించామని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకుని వాటికి తక్షణమే పరిష్కారం చూపాలని అధికారులకు అదనపు కలెక్టర్ సూచించారు.
ఈకార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు,రెవెన్యూ డివిజనల్ అధికారులు, కలెక్టరేట్ సెక్షన్ అధికారులు, ప్రజలు,సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.